పాఠకులకు ఈరోజు మొబైల్ ప్రత్యేకం..

Posted By: Super

పాఠకులకు ఈరోజు మొబైల్ ప్రత్యేకం..

 

జడ్‌టిఈ మరోసారి వార్తల్లోకి వచ్చింది. జడ్‌టిఈ ఎప్పుడూ తక్కువ ధర కలిగిన మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేస్తూ ఉంటుంది. ఐతే ఈసారి మాత్రం మార్కెట్లోకి ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. దాని పేరు 'జడ్‌టిఈ క్రిసెంట్'. క్రిసెంట్ అంటే తెలుగులో చంద్రవంక. చంద్రవంక ఎలాగైతే ఉంటుందో అచ్చం అదే మాదిరి జడ్‌టిఈ క్రిసెంట్ మొబైల్ కూడా ఉండడం విశేషం.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.5 ఇంచ్ టిఎప్‌టి స్క్రీన్ డిస్ ప్లేతో పాటు WVGA రిజల్యూషన్ దీని సొంతం. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో ARM11, 800MHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 512MB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. ఆటో ఫోకస్ కెమెరా ప్రత్యేకత. ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యేందుకు గాను, జిపిఆర్‌ఎస్ ప్రత్యేకం. బ్యాటరీ బ్యాక్ టాక్ టైమ్ 280 నిమిషాలు, స్టాండ్ బై టైమ్ 250 గంటలు. అధికారకంగా జడ్‌టిఈ క్రిసెంట్ మొబైల్ ధరని వెల్లిడంచ లేదు.

జడ్‌టిఈ క్రిసెంట్ మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్

చుట్టుకొలతలు:     58.5 x 117 x 10.6 millimetres

బరువు:     120 grams (battery included)

సాప్ట్‌వేర్

ఆపరేటింగ్ సిస్టమ్:     Google Android 2.3.5

సిపియు చిప్‌సెట్:     800 MHz

సిపియు:     Qualcomm MSM7227T

మెమరీ

RAM కెపాసిటీ:     512 MiB

డిస్ ప్లే

డిస్ ప్లే సైజు:     3.5 inches

డిస్ ప్లే రిజల్యూషన్:     480 x 800

కెమెరా

కెమెరా:     4.9 MP

ఆటోఫోకస్:     Supported

ఆప్టికల్ జూమ్:     1 x

ప్లాష్:     mobile light (LED)

సెకండరీ కెమెరా:     0.3 MP

ఇంటర్ ఫేసెస్

మెమరీ స్లాట్స్:     microSD, microSDHC, TransFlash

యుఎస్‌బి:     USB 2.0 client, 480Mbit/s

బ్లూటూత్:     Bluetooth 2.1 + EDR

వైర్‌లెస్ ల్యాన్:     802.11b, 802.11g, 802.11n

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot