అరచేతిలో విశ్వం గుట్టు!!

Posted By:

అరచేతిలో విశ్వం గుట్టు!!

 

‘‘టెక్నాలజీ అభివ్ళద్ధి చెందుతున్న నేపధ్యంలో సమాచార సాధనాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.. సరిగ్గా అరచేతిలో ఇమిడే సాంకేతిక పరికరంతో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం.. ఒకప్పడు మాట్లాడటానికే పరిమితమైన మొబైల్‌ఫోన్‌లు ఇప్పుడు ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు సహకరిస్తున్నాయి. ప్రస్తుత ప్రపంచాన్ని స్మార్ట్‌ఫోన్‌ల శాసిస్తున్నాయి. యువత మొదలకుని పండు ముసలి వరకు ఈ స్మార్ట్‌ఫోన్ సౌలభ్యతలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు.’’

ప్రముఖ టెలీ కమ్యూనికేషన్స్ అదేవిధంగా నెట్‌వర్క్ సొల్యూషన్స్ సంస్థ జడ్‌టీఈ తాను రూపొందించిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించింది. ZTE Eraగా రూపాంతరం చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ క్వాడ్‌కోర్ విభాగంలో సంచలనాన్ని స్ళష్టించేదిగా ఉంది. అత్యంత పల్చటి క్వాడ్‌కోర్ డివైజ్‌గా గుర్తింపు తెచ్చుకున్న Era ఆధునిక స్పెసిఫికేషన్‌లతో పాటు ఆడ్వాన్సుడ్ కంట్రోలింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మందం కేవలం 7.8ఎమ్ఎమ్.

ఫోన్ ముఖ్య ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* ఎన్-విడియా టెగ్రా 3, 1జిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

* 4.3 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్,

* 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ ఎల్‌ఈడి ఫ్లాష్, వీజీఏ ప్రంట్ కెమెరా, 1080 పిక్సల్ ఇమేజ్ క్వాలిటీతో వీడియో రికార్డింగ్,

* 1జీబి ర్యామ్, 8జీబీ రోమ్,

* 32జీబి ఎక్సటర్నల్ మెమెరీ,

* 3జీ కనెక్టువిటీ (HSDPA, 21 Mbps, HSUPA, 5.6 Mbps),

* జీపీఆర్ఎస్ (క్లాస్ 12),

* ఎడ్జ్ (క్లాస్ 12),

* WLAN ( UMA, Hotspot enabled, DLNA),

* జీపీఎస్ సౌలభ్యత,

* 2జీ,3జీ నెట్‌వర్క్ సపోర్ట్,

* ఆడియో ప్లేయర్, వీడియా ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో,

* డాల్బీ సౌండ్ సిస్టం,

* బ్యాటరీ స్టాండ్ బై 500 గంటలు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting