ఫ్యాషన్ టీవీ ఫోన్!!!

Posted By: Prashanth

ఫ్యాషన్ టీవీ ఫోన్!!!

 

ఫ్యాషన్ అంటే పడిచచ్చే మోడ్రన్ యువతకు ఈ వార్త మరింత సంతృప్తినిస్తుంది. ప్రముఖ మొబైల్ ఉత్సాదక బ్రాండ్ ‘ZTE’ ఫ్యాషన్ సంస్కృతిని మరింత చేరువ చేస్తూ ఫ్యాషన్ టీవీ మొబైల్‌ను మార్కెట్‌కు పరిచయం చేయునుంది. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన కూల్ ఎఫ్‌టీవీ అప్లికేషన్స్, వీడియోస్, వాల్ పేపర్స్, పోర్టల్స్ , ఫ్యాషన్ సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తాయి.

‘ZTE FTV ఫోన్’గా డిజైన్ కాబడిన ఈ గ్యాడ్జెట్ వైట్, గోల్డ్, బ్లాక్ రంగుల్లో లభ్యంకానుంది. మరిన్ని ముఖ్య ఫీచర్లు:

* గుగూల్ ఆండ్రాయిడ్ v2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం, * 600 MHz ARM 11 ప్రాసెసర్, * క్వాల్కమ్ MSM7227 చిప్‌సెట్, * అడ్రినో 200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * జీపీఆర్ఎస్, ఎడ్జ్ ఇంటర్నెట్ కనెక్టువిటీ సపోర్ట్, * 3జి ఇంటర్నెట్ కనెక్టువిటీ, * 3.15 మెగా పిక్సల్ కెమెరా, * యాక్సిలరో మీటర్, డిజిటల్ కంపాస్ అదే విధంగా ప్రాక్సిమిటీ సెన్సార్, * హాట్ స్పాట్ వ్యవస్థతో కూడిన వై-ఫై ఇంటర్నెట్ కనెక్టువిటీ, * మైక్రో యూఎస్బీ పోర్ట్, * జీపీఎస్ సపోర్ట్, * గుగూల్ అప్లికేషన్స్, * 192 గంటల స్టాండ్‌బై టాక్‌టైమ్ నిచ్చే స్లాండర్డ్ 1250 mAh బ్యాటరీ, * ఫోన్ డిస్‌ప్లే 3.5 అంగుళాలు, * మల్టీ టచ్ సపోర్ట్.

సెకండరీ కెమెరా వ్యవస్థ డివైజ్‌లో లోపించింది. ప్రాసెసర్ నిరుత్సహానికి గురి చేస్తుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టంను అప్‌గ్రేడ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting