మార్కెట్లోకి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్

Posted By:

ఫైర్‌ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ జెడ్‌టీఈ ఓపెన్ సీ ఇప్పుడు ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ eBay  డివైస్‌ను రూ.9,999కి విక్రయిస్తోంది.  ఓపెన్ సీ స్మార్ట్‌ఫోన్‌ను జెడ్‌టీఈ గడిచిన మేలో ఆవిష్కరించింది. ఈ సొగసరి స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను ఫైర్‌ఫాక్స్ 1.3 వర్షన్ అలానే ఆండ్రాయిడ్ కిట్‌‍క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ చేసుకోవచ్చు. ఫోన్ ఫీచర్లను పరిశీలించినట్లయితే...

మార్కెట్లోకి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాససర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (ఎడ్జ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో),
1400 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot