హిరో గారు ఎనిమిదో సారి రె‘ఢీ’..!!

Posted By: Staff

హిరో గారు ఎనిమిదో సారి రె‘ఢీ’..!!

 

ప్రఖ్యాత చైనా మొబైల్ నిర్మాణ సంస్థ జడ్‌టీఈ, తన ఎనిమిదవ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘జడ్‌టీఈ బార్సిలోనా’ను ప్రతిష్టాత్మకంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. హ్యాండ్‌సెట్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక బ్లూటూత్, వై-ఫై వ్యవస్థలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మధ్య స్థాయి మొబైల్ మార్కెట్‌ను ద్ళష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

స్మార్ట్‌ఫోన్ ముఖ్య ఫీచర్లు:

* డ్యూయల్ సిమ్,

* ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* 2జీ మరియు 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,

* 3జీ కనెక్టువిటీ,

* 2.4 GHz సామర్ధ్యంతో కూడిన వై -ఫై 802.11 (b/g/n)వ్యవస్థ,

* బ్లూటూత్ 2.1+EDR module.

మార్చి చివరిలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ‘జడ్‌టీఈ బార్సిలోనా’ యూరోపియన్ మార్కెట్‌లలో లభ్యం కానుంది. ఇండియాలో విడుదలకు సంబంధించి ఏ విధమైన సమాచారం లేదు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot