రెండో సారి సేమ్ కాంభినేషన్.. హిట్టా ఫట్టా?

Posted By: Prashanth

రెండో సారి సేమ్ కాంభినేషన్.. హిట్టా ఫట్టా?

 

ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ ZTE తాను తాజాగా రూపొందించబోతున్న స్మార్మ్‌ఫోన్‌కు సంబంధించి వివరాలను వెల్లడించింది. ZTE Orbitగా రూపుదిద్దుకుంటున్న తమ సరికొత్త స్మార్ట్‌ఫోన్ విండోస్ ట్యాంగో ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది.

ఫోన్ ముఖ్య ఫీచర్లు:

* విండోస్ ఫోన్ ట్యాంగో ఆపరేటింగ్ సిస్టం,

* 5 మెగా పిక్సల్ కెమెరా,

* 4జీబి ఇంటర్నల్ మెమెరీ,

* బ్లూటూత్,

* వై-ఫై,

* హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్,

కర్వ్ ఎడ్జెస్‌తో ఆకర్షణీయమైన స్టైల్ రూపుదిద్దుకున్న ఈ క్యాండీ బార్ ఫోన్ డిస్‌ప్లే విషయంలో నోకియా లూమియా సిరీస్‌ను తలపిస్తుంది. నిక్షిప్తం చేసిన విండోస్ ఫోన్ ట్యాంగో ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీ స్వభావం కలిగి ఉంటుంది. మూడు టచ్ సెన్సిటివ్ బటన్‌లను స్ర్కీన్ కింది పోర్షన్‌లో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. కెమెరా వ్యవస్థకు అదనంగా దోహదం చేసిన LED ఫ్లాష్ వ్యవస్థ క్వాలిటీ ఫోటోలను అందిస్తుంది. ఏర్పాటు చేసిన హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్ వ్యవస్థ సౌకర్యవంతమైన బ్రౌజింగ్‌కు తోడ్పడుతుంది. విండోస్ వోఎస్ ఆధారితంగా పనిచేసే ZTE స్మార్ట్ ఫోన్‌లలో ఆర్బిట్ రెండోది. త్వరలో విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot