అక్టోబర్‌లో రచ్చ రచ్చే!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు జడ్‌టీఈ కొత్త తరం మొబైల్ టెక్నాలజీతో నిండిన ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. టాక్ ఆండ్రాయిడ్ ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ నెట్‌వర్క్ ఆపరేటర్ స్ప్రింట్ ఆధ్వర్యంలో అక్టోబర్‌లో విడుదల కానుంది. డివైజ్ ఖచ్చితమైన ధర ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఫీచర్లు:
4.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
12.6 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంకు వృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు..
జడ్‌టీఈ ‘ఆప్టిక్ ’రూ.5000కే!!!
కంప్యూటింగ్ పరికరాల తయారీ సంస్థ జడ్‌టీఈ ఇటీవల లాంఛ్ చేసిన సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్ ‘ఆప్టిక్ ’.లో బడ్జెట్ వినియోగదారుల కోసం డిజైన్ చేయ్యిబడిన ఈ డివైజ్ కంప్యూటింగ్ అదేవిధంగా ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను తీర్చచటంలో పూర్తి స్థాయి పనితీరును కనబరుస్తుంది. టాబ్లెట్ ప్రధాన ఫీచర్లను పరిశీలిస్తే… 7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్ డ్రాగెన్ 1.2 జిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ సపోర్ట్, బ్రౌజర్ సపోర్ట్ (హెచ్‌టిఎమ్ఎల్, హెచ్‌టిఎమ్ఎల్ 5), నెట్‌వర్క్ సపోర్ట్ 2జీ, 3జీ, మల్టీ ఫార్మాట్ ఆడియో ప్లేయర్, మల్టీ ఫార్మాట్ వీడియో ప్లేయర్, గేమ్స్, స్టీరియో స్పీకర్స్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ కనెక్టర్, 4000 mAh Li ion బ్యాటరీ, అంచనా ధర రూ.5,000.


Click it and Unblock the Notifications








