ఈ డిసెంబర్‌లో మీ ముందుకు మల్టీ మీడియా టచ్!!!

Posted By: Staff

ఈ డిసెంబర్‌లో  మీ ముందుకు మల్టీ మీడియా టచ్!!!

 

ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీదారు జడ్‌టీ‌ఇ(ZTE) ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుంది. ఈ సంస్థ నుంచి  తాజగా వెలువడుతున్న   ‘ZTE V881’ ఆడ్వాన్సడ్ మల్టీ మీడియా టచ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ , ఈ డిసెంబర్‌లో వినియోగదారుల ముందుకు రానుంది.

మార్కెట్ అంచనాలను ప్రభావితం చేస్తున్న  జడ్‌టీ‌ఇ(ZTE) ముఖ్య ఫీచర్లు:

గుగూల్ ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం పై  ఫోన్ రన్ అవుతుంది. శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ MSM8255 సీపీయూ ప్రాసెసింగ్ వ్యవస్థను  ఫోన్లో నిక్షిప్తం చేశారు.  వేగవంతంగా స్పందించే 512 ఎంబీ సామర్ధ్యం గల LPDDR2 SD ర్యామ్‌ను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు, నిక్షిప్తం చేసిన క్వాల్కమ్ అడిర్నో 205 గ్రాఫిక్ కంట్రోలర్ వ్యవస్థ  మన్నికైన గ్రాఫిక్ విజువల్స్ ను విడుదల చేస్తుంది. పొందుపరిచిన రిఛార్జబుల్ లితియమ్ ఇయాన్ బ్యాటరీ వ్యవస్థ పటిష్టమైన బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

డిస్‌ప్లే అంశాలు:

3.8 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 480 x 800 పిక్సల్స్, మల్టీ టచ్ స్ర్కీన్ టెక్నాలజీ

కెమెరా స్పెసిఫికేషన్లు:

5 మెగా పిక్సల్ సామర్ధ్యం గల కెమెరా వ్యవస్థను ఫోన్లో ఏర్పాటు చేశారు.

కనెక్టువిటీ మరియు నెట్ వర్క్ ఫీచర్లు:

జీఎస్ఎమ్ 900/1800 MHz నెట్‌వర్క్ వ్యవస్థలను ఈ డివైజు సపోర్ట్ చేస్తుంది, ఏ-జీపీఎస్ (A-GPS) నావిగేషన్, డేటా హై స్సీడ్ ట్రాన్స్ ఫర్ కు దోహదపడే విధంగా యూఎస్బీ, బ్లూటూత్ కనెక్టువిటీ వ్యవస్థ, వేగవంతమైన నెట్ బ్రౌజింగ్‌కు సహకరించే విధంగా  802.11 b/g/n వై-ఫై  కనెక్టువిటీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్ వ్యవస్థల వెసలుబాటు,  మైక్రో ఫోన్, లౌడ్ స్పీకర్, వైబ్రేటింగ్ అలర్ట్,  3.5 mm ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, MP3, MPEG4 ఫార్మాట్లు సపోర్ట్ చేసే విధంగా ఆడియో, వీడియో ప్లేయర్లు ఏర్పాటు, హై డెఫినిషన్ టీవీలకు జత చేసుకునే విధంగా హెచ్డీఎమ్ఐ  ఇన్ పుట్ పోర్ట్, ఎక్సప్యాండబల్ విధానం ద్వారా స్మార్ట్ ఫోన్ మెమరీని 32జీబికి పెంచుకోవచ్చు. ‘ZTE V881’ ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot