విడుదల తేదీ ఖరారు కాలేదు..?

Posted By: Staff

విడుదల తేదీ ఖరారు కాలేదు..?
ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ జడ్‌టీఈ( ZTE) మార్కెట్లో తన స్థాయిని మరింత విస్తరించుకుంటుంది. తాజాగా ఈ బ్రాండ్ క్లాసికల్ టచ్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను వ్ళద్థి చేసింది. ZTE X501 నమూనాలో డిజైన్ కాబడిన ఈ డివైజ్ ఉత్తమ క్వాలిటీ పనితీరును అందించటంతో పాటు మెరుగైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటుంది.

ఫోన్‌లో దాగి ఉన్న విశిష్ట అంశాలు:

* టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 3.1 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, వీడియో రికార్డింగ్, ఇంటర్నల్ మెమెరీ సౌలభ్యత, మైక్రో‌ఎస్డీ కార్డ్‌స్లాట్, జీపీఆర్ఎస్ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఎస్ ఫెసిలిటీ, 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, బ్యాటరీ స్టాండ్ బై 240 గంటలు, గుగూల్ ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన క్వాల్కమ్ MSM7227T ప్రాసెసర్, WAP బ్రౌజర్.

డివైజ్‌లో నిక్షిప్తం చేసిన వై-ఫై వ్యవస్థ నెట్ బ్రౌజింగ్ వేగాన్ని మరింత పెంచుతుంది. బ్లూటూత్ వ్యవస్థ ఫోన్ డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ZTE X501 విడుదల ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot