లెనోవో ఆ మొబైల్ బ్రాండ్‌ను ఆపేస్తోంది..?

సంవత్సరం క్రితం తన Moto బ్రాండ్‌‌ను 'Moto by Lenovo' బ్రాండ్‌గా మార్చిన లెనోవో...

|

తాము లాంచ్ చేసే అన్ని స్మార్ట్‌ఫొన్‌లను ఒకే గూటి క్రిందకు తీసుకువచ్చేందుకు Moto బ్రాండ్‌‌ను 'Moto by Lenovo' బ్రాండ్‌గా మార్చిన లెనోవో, తన సబ్సిడరి మొబైల్ బ్రాండ్ అయిన Zuk Mobileను మరికొద్ది వారాల్లో మూసివేయబోతున్నట్లు సమాచారం.

ఆన్‌లైన్ బ్రాండ్..

ఆన్‌లైన్ బ్రాండ్..

Zuk Mobile ఆన్‌లైన్ బ్రాండ్ కావటంతో, ఈ బ్రాండ్ నుంచి లాంచ్ అయిన అన్ని స్మార్ట్‌ఫోన్‌లు కేవలం ఆన్‌లైన్ మార్కెట్లో మాత్రమే లభ్యమవుతూ వచ్చాయి.

Zuk Z1తో మొదలెట్టి...

Zuk Z1తో మొదలెట్టి...

లెనోవో ఈ మొబైల్ బ్రాండ్‌ను 2015లో షియోమీ వంటి బ్రాండ్‌లకు పోటీగా లాంచ్ చేసింది. ఇప్పటి వరకు ఈ బ్రాండ్ నుంచి 5 స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వీటిలో మొదటి ఫోన్ Zuk Z1 కాగా చివరి ఫోన్ Zuk Edge.

అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు...

అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు...

చైనా సోషల్ మీడియా విస్తృతంగా చక్కర్లు కొడుతోన్న ఈ సమాచారం పూర్తిగా వాస్తవమైనట్లయితే Zuk Mobile బ్రాండ్ ప్రస్థానం 23 నెలలతో ముగిసినట్లే. Zuk Mobile బ్రాండ్ నిలిపివేతకు సంబంధించి లెనోవో వద్ద ఇప్పటి వరకు ఏ విధమైన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు.

లెనోవో, మోటో ఇంకా జుక్ కాంభినేషన్‌తో..

లెనోవో, మోటో ఇంకా జుక్ కాంభినేషన్‌తో..

తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే లెనోవో, మోటో ఇంకా జుక్ కాంభినేషన్‌తో కొత్త బ్రాండ్ మార్కెట్లో వచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 Zuk's ZUI skinతో..

Zuk's ZUI skinతో..

ప్రస్తుతం, మోటో రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల పై లెనోవో ఎక్కువుగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మోటో సిరీస్ నుంచి త్వరలో లాంచ్ కాబోతోన్న రెండు స్మార్ట్‌ఫోన్‌లు Zuk's ZUI skinతో వస్తున్నాయని లెనోవో వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ చెన్ యు ధృవీకరించారు.

Best Mobiles in India

English summary
Zuk Mobile to Reportedly Be Shut Down by Lenovo in Next Few Weeks. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X