360@నోకియా!!

Posted By: Super

360@నోకియా!!

 

మొబైల్స్ వ్యాపారంలో అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చుకున్న ‘నోకియా’ మ్యూజిక్ గ్యాడ్జెట్ల వ్యాపరంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రముఖ బ్రాండ్ విడుదల చేసిన ‘నోకియా ప్లే 360 స్పీకర్’ మార్కెట్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

ఈ పోర్టబుల్ స్పీకర్ ‘360’ డిగ్రీల సమాన పరిమాణంలో శబ్ధాన్ని విడుదల చేస్తుంది. అంటే ఈ స్పీకర్ ద్వారా విడుదలయ్యే సౌండ్ నలుదిశలా వ్యాపిస్తుంది. బ్లూటూత్ ఆధారితంగా ఈ స్పీకర్ సిస్టంను జత చేసుకోవల్సి ఉంటుంది. బ్లూటూత్ సౌలభ్యతున్న ఏ గ్యాడ్జెట్ కైనా నోకియా ప్లేను అనుసంధానం చేసుకోవచ్చు. స్పీకర్ బరువు కేవలం 514 గ్రాములు. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు.

పటిష్ట ‘నోకియా BL-5C’ బ్యాటరీని స్పీకర్లో ఏర్పాటు చేశారు దీని బ్యాకప్ 21 గంటలు. స్పీకర్ సిస్టంలో అదనంగా 3.5mm కనెక్టర్ జాక్ ను ఏర్పాటు చేశారు. ఈ సౌలభ్యతతో 3.5mm ఆడియో కేబుల్ ఆధారితంగా ఇతర డివైజులకు జత చేసుకోవచ్చు. ‘NFC’ యనేబులింగ్ వ్యవస్థ ‘నోకియా ప్లే 360 స్పీకర్ సిస్టం’కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ మ్యూజిక్ పరికరం ధర రూ.10,000 ఉండోచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot