కేక పుట్టించే ఆడియో!

మ్యూజిక్ ప్రియుల గుండెల్లో 100 మెగావాట్ట జోష్‌ను నింపేందుకు ఆడియో పరికరాల తయారీ సంస్థ ఐహోమ్ శ్రీకారం చుట్టింది. సంగీతాన్ని వినూత్నమైన అనుభూతులతో చేరువ చేసే ‘కలర్ చేంజింగ్ స్పీకర్’ను బ్రాండ్ డిజైన్ చేసింది. పేరు ఐపీ76. ఐఫోన్ ఇంకా ఐపోడ్‌లకు ఈ స్పీకర్ సహకరిస్తుంది. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన కలర్ ఛేంజింగ్ ఫీచర్ ఎల్‌ఈడీల సాయంతో వివిధ రంగుల్లో కాంతులను విరజిమ్ముతుంది. బ్లూటూత్ ఆధారితంగా పనిచేసే స్పీకర్ సిస్టం ఉత్తమ శ్రేణి సంగీతానుభూతికి లోను చేస్తుంది. సిస్టంలో పొందుపరిచిన రీజన్ 8 టెక్నాలజీతో కూడిన 4 స్పీకర్లు క్రిస్టల్ క్లియర్ ఆడియో అనుభూతులను అందిస్తాయి. ఇతర బ్లూటూత్ ఆధారిత డివైజ్‌లను నుంచి మ్యూజిక్‌ను స్ట్రీమ్ చేసుకోవచ్చు. మ్యూజిక్‌ను వెరైటీ కోణంలో ఆస్వాదించాలనుకునే వారికి ఐహోమ్ ఐపీ76 ఉత్తమ ఎంపిక. జూలై నుంచి ఈ స్పీకర్ అందుబాటులోకి రానుంది. ధర అంచనా రూ.10,000.
ఐహోమ్ మ్యూజిక్
ఆపిల్ డివైజ్‌లకు ఆడియో పరికరాలను సమకూర్చే ఐహోమ్ సంస్థ తాజాగా iW2 మెడల్‌లో కొత్త ఎయిర్‌ప్లే స్పీకర్లను డిజైన్ చేసింది. ఏప్రిల్ నాటికి ఈ స్పీకర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ధర అంచనా రూ.10,000. వైర్‌లెస్ వ్యవస్థను ఈ స్పీకర్ సిస్టం పొందుపరిచారు.
ముఖ్య ఫీచర్లు:
* మ్యూజిక్ ప్లేబ్యాక్,
* యూనివర్సల్ ఏసీ ఆడాప్టర్,
* వై-ఫై,
* ఐఆర్ రిమోట్,
* SRS WOW HD ఆడియో ప్రాసెసింగ్,
* ఇతర ఆడియో సోర్సుల కొరకు aux-in jackను స్పీకర్ సిస్టంలో సమకూర్చారు.
* యూఎస్బీ పోర్టు,
* Reson8 స్పీకర్ ఛాంబర్స్.


Click it and Unblock the Notifications








