ఆరోగ్యం.. ఆనందం!

Posted By: Super

ఆరోగ్యం.. ఆనందం!

ఆపిల్ ఐఫోన్‌కు విడిభాగాలను సమకూర్చే ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గేర్4 (GEAR4) భారతీయ మార్కెట్లో ఓ డాక్ స్పీకర్ గ్యాడ్జెట్‌ను విడదల చేసింది. పేరు ‘రీన్యూ స్లీప్ క్లాక్’.ఈ డివైజ్ క్వాలిటీ కూడిన సౌండ్‌ను ఉత్పత్తి చెయ్యటంతో పాటు నిద్ర సంబంధిత అంశాల పట్ల యూజర్ కు అవగాహన కలిగిస్తుంది. నిక్షిప్తం చేసిన డాక్ ద్వారా స్పీకర్‌ను ఐఫోన్, ఐపాడ్ ఇంకా ఐపోడ్‌లకు జత చేసుకోవచ్చు. ధర అంచనా రూ.20,000.

ప్రత్యేకతలు:

స్లీప్ మానిటర్,

ఐఫోన్, ఐప్యాడ్, ఐపోడ్‌లకు స్పీకర్‌లా వాడుకోవచ్చు,

అత్యుత్తమ సౌండ్ క్వాలిటీ,

యూజర్ నిద్రిస్తున్న తీరు పట్ల రియల్-టైమ్ విశ్లేషణ,

నిద్ర సంబంధిత వ్యాధుల నివారణకు కృషి,

మెరుగైన నిద్ర కోసం సూచనలు.

ఈ స్పీకర్ లో పొందుపరిచిన ప్రత్యేకమైన అప్లికేషన్ లు నిద్రసంబంధిత అంశాల పట్ల పూర్తి స్థాయి అవగాహనను కలిగి ఉంటాయి. నిద్రవిషయంలో యూజర్ అనుసరిస్తున్న తీరును ఎప్పటికప్పుడు అంచనా వేయటంతో పాటు తగ సలహాలు సూచనలను ఈ స్పీకర్ అందిస్తుంది.

ఆపిల్ ఐప్యాడ్ యూజర్ల కోసం!

ఆపిల్ గ్యాడ్జెట్‌లకు మ్యూజిక్ ఉపకరణాలను సమకూర్చే కంపెనీల జాబితా రోజు రోజుకు పెరగుతుతోంది. తాజాగా ఈ లిస్ట్‌లోకి ‘రాకెట్ ఫిష్’ సంస్థ వచ్చి చేరింది. ఈ కంపెనీ ప్రత్యేకించి ఐప్యాడ్ 2, ఐప్యాడ్ 3ల కోసం పోర్టబుల్ స్పీకర్‌ను డిజైన్ చేసింది. పేరు ‘సౌండ్ ప్రిస్మ్’.ఈ మాస్ట్రర్ సౌండ్ పీస్‌ను క్రియోట్ డిజైన్ స్టూడియో డిజైన్ చేసింది. ప్రత్యేకించి ఐప్యాడ్‌లో కోసం రూపొందించబడిన సౌండ్ ప్రిస్మ్ క్లారిటీతో కూడిన హై క్వాలిటీ ఆడియోను ఉత్పత్తి చేస్తుంది.

సౌండ్ ప్రిస్మ్ విశేషాలు:

బ్లూటూత్ కనెక్టువిటీ, రీఛార్జబుల్ డిజైన్, బరువు 7.8oz,సంవత్సరం వారంటీ, ధర రూ.4,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot