ఉత్తమ క్వాలిటీ ఆడియోకు పరిపూర్ణమైన స్పీకర్!!

Posted By: Staff

ఉత్తమ క్వాలిటీ ఆడియోకు పరిపూర్ణమైన స్పీకర్!!

 

హై క్వాలిటీ ఆడియో ఉత్పత్తులను అందించటంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న ఇడిఫిర్(Edifier) కొత్త తరహా సౌండ్ స్పీకర్‌ను లాంఛ్ చేసింది. ఇడిఫిర్ MP250 నమూనాలో వస్తున్న ఈ ఆడియో డివైజ్ అబ్బురపరిచేదిగా ఉంటుంది. ఆల్యూమినియమ్ పొరతో కప్పబడి ఉండే ఈ పది అంగుళాల పొడవాటి స్పీకర్ 1.5 అంగుళాల వెడల్పు నిష్పత్తిని కలిగి త్రికోణాక్ళతిలో ఉంటుంది. ఏర్పాటు చేసిన రెండు ఛానల్ స్టీరియో స్పీకర్స్, రెండు 1.25 అంగుళాల డ్రైవర్స్ ఉత్తమ క్వాలిటీ సౌండ్‌ను విడుదల చేస్తాయి. యూఎస్బీ పోర్ట్ ఆధారితంగా ఈ స్పీకర్‌ను కంప్యూటర్‌కు జత చేసుకోవల్సి ఉంటుంది.

 స్పీకర్ కీలక ఫీచర్లు:

* 10 అంగుళాల పొడవు,

* 1.5 అంగుళాల వెడల్పు,

* 1.1 పౌండ్ల బరువు,

* 1.5 అంగుళాల సౌండ్ డ్రైవర్స్,

* యూఎస్బీ కేబుల్,

* 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

* సౌండ్ సర్దుబాటు చేసేకునేందుకు పుష్ బటన్.

* ధర రూ.3,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot