వినోదాల విందు!!

Posted By: Super

వినోదాల విందు!!

 

కౌన్ సంస్థ సరికొత్త పోర్టుబల్ ఆండ్రాయిడ్ మీడియా ప్లేయర్‌ను ఆవిష్కరించింది. ఈ డివైజ్ మోడల్ ‘ప్లెన్యు Z2’. రెండు మెమరీ వేరియంట్‌లలో ఈ ప్లేయర్ లభ్యం కానుంది. ఈ మీడియా పరికరంలో నిక్షిప్తం చేసిన

కీలక ఫీచర్లు:

3.7 అంగుళాల టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్) , కెపాసిటివ్ టచ్ ప్యానెల్, ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం, 95డెసిబల్ ఎస్ఎన్ఆర్, హెచ్‌డిఎమ్ఐ అవుట్‌పుట్, మైక్రో‌ఎస్డీ ఎక్స్‌పానిషన్ స్లాట్, బుల్ట్-ఇన్ ఎఫ్ఎమ్ ట్యూనర్, ఇంటర్నల్ మైక్రోఫోన్, ఆడియో ఫిల్టర్స్, క్యాలెండర్, ఈ-మెయిల్, వెబ్ బ్రౌజర్, ట్విట్టర్ అప్లికేషన్, మైక్రో యూఎస్బీ పోర్టు, ఫైల్ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్ 2.1.

డివైజ్ ఆడియో ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం 20Hz నుంచి 20,000Hz వరకు. బ్యాటరీ సామర్ధ్యాన్ని పరిశీలిస్తే ఆడియో ప్లేబ్యాక్ టైమ్ 22 గంటలు, వీడియో ప్లేబ్యాక్ టైమ్ 8.5 గంటలు. 3.2 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే సౌకర్యవంతంగా స్పందిస్తుంది. అన్ని రకాలైన ఆడియో, వీడియో ఫార్మాట్‌లను ఈ ప్లేయర్ సపోర్ట్ చేస్తుంది.

పొందుపరిచిన వై-ఫై సౌలభ్యతతో వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు. ట్విట్లర్ వంటి సోషల్‌నెట్ వర్కింగ్ సైట్లలోకి ప్రవేశించే సదుపాయం. గుగూల్ ప్లే స్టోర్‌ యాక్సిస్ ఉండటంతో  వివిధ అప్లికేషన్‌లను

డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 16, 32జీబి మెమరీ వేరియంట్‌లలో ప్లెన్యు Z2 లభ్యం కానుంది. మే నాటికి యూఎస్‌లో విడుదల కానున్న ప్లెన్యు మీడియా ప్లేయర్ల ధరలు రూ.14,000 నుంచి ప్రారంభం కానున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot