ట్రాఫిక్‌లో ఉన్నారా..? అయినా సరే!!!

Posted By: Staff

ట్రాఫిక్‌లో ఉన్నారా..? అయినా సరే!!!

 

హెడ్ ఫోన్లను అధికంగా ఇంట్లోనే ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు చర్చించుకోబోతున్న ‘హెడ్ ఫోన్స్’ను బాహ్య వాతవరణంలోనూ  ఉపయోగించుకోవచ్చు. మ్యూజిక్, ఆటోమొబైల్స్ సంబంధిత పరికరాలను రూపొందించటంలో ప్రముఖంగా నిలిచిన ‘ఏబుల్ ప్లానెట్’ (AblePlanet) క్లియర్  హార్మోని పేరుతో  అత్యాధునిక హెడ్ ఫోన్లను విడుదల చేసేంది.

ప్రవైసీ కోరుకునే వారు హెడ్‌ఫోన్స్ ద్వారా సంగీతాన్ని ఆస్వాదిస్తుంటారు. మ్యూజిక్ ఆస్వాదిస్తున్న సందర్భంలో బాహ్య వాతావరణం నుంచి  ఎదురయ్యే అనేక అంతరాయాలు  వారి  మూడ్‌కు ఆటంకాలు కలిగిస్తుంటాయ.  ఏబుల్ ప్లానెట్ ప్రవేశపెట్టిన  క్లియర్ హార్మోని హెడ్‌ఫోన్స్  ఈ విధమైన సమస్యలకు పూర్తి స్ధాయిలో చెక్ పెడతాయి. ఈ  స్పీకర్ సిస్టంలో పొందుపరిచిన  అత్యాధునిక నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ అంతరాయంలేని క్లారిటీ ఆడియోను అంతిమంగా శ్రోతకు అందిస్తుంది. ఇన్‌లైన్  వాల్యూమ్ కంట్రోల్, 5 అడుగల హెడ్‌ఫోన్ కార్డ్, ఎయిర్ ప్లేన్ ఆడాప్టర్  వంటి మన్నికైన  ఫీచర్లను ఈ స్పీకర్ సిస్టంలో పొందుపరిచారు.

చెవులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా  ఇయర్  ప్యాడ్స్‌ను డిజైన్ చేశారు.  గ్యాడ్జెట్లో పొందుపరచిని నాయస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం  20 నుంచి 20,000 Hz వరకు. అవుట్ పుట్ పవర్ 30m W. కలర్ సిల్వర్ బ్లాక్. హెడ్‌ఫోన్ సెట్‌లో ఏర్పాటు చేసిన AAA బ్యాటరీ వ్యవస్త దీర్ఘాకాలిక బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మార్కెట్ ధర రూ.10,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting