చిన్నారుల కోసం ఐగో(iGo) హెడ్‌ఫోన్స్!!

Posted By: Staff

చిన్నారుల కోసం  ఐగో(iGo) హెడ్‌ఫోన్స్!!

ప్రముఖ ఆడియో పరికరాల తయారీదారు ఐగో (iGo) ప్రత్యేకించి చిన్నారుల కోసం  ఏరియల్ 7 ఆర్కేడ్ సిరీస్‌లో హెడ్‌ఫోన్‌లను డిజైన్ చేసింది. ఆకర్షణీయమైన ఫంకీ డిజైన్స్‌లో వీటిని రూపొందించారు. చిన్నారులకు కంఫర్ట్‌గా ఫిట్ అయ్యే విధంగా

ఎడ్జెస్ట్‌మెంట్ వ్యవస్థను  గ్యాడ్జెట్‌‌లలో నిక్షిప్తం చేశారు.

హై క్వాలిటీ ఆడియో అనుభూతిని ఈ హెడ్‌ఫోన్‌ల ద్వారా  చిన్నారులు ద్వారా ఆస్వాదించగలుగుతారు.  మొబైల్ హ్యాండ్‌సెట్స్, డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్స్, ఎంపత్రీ మ్యూజిక్ స్టిక్స్, ఐపోడ్స్ ఇతర మ్యూజిక్ డివైజ్‌లకు ఈ ఆడియో స్పీకర్‌ను జత చేసుకోవచ్చు. ఆటోమెటిక్ వాల్యుమ్ రిడక్షన్ వ్యవస్థను ప్రత్యేకించి డివైజ్‌లో ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ సౌండ్‌ను 85డెసిబల్స్‌కు మించి పెంచదు. భారతీయ మార్కెట్లో విడుదల కాబోతున్న  ‘ఏరియల్ 7’ హెడ్‌ఫోన్స్ నాలుగు వేరు వేరు డిజైన్‌లలో చిన్నారులను ఆకట్టుకోనున్నాయి. ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot