ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..?

Posted By: Prashanth

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..?

 

‘ఐపాడ్ డాక్ స్పీకర్ సిస్టం’లు మార్కెట్లో కప్పులు తెప్పలుగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని మాత్రమే వినియోగదారులను మెప్పించగలుగుతున్నాయి. వీటి ఫెయిల్యుర్‌కు ప్రధాన కారణం సౌండ్ క్యాలిటీలో నాణ్యత లోపించటమే. ఆడియో పరికరాల నిర్మాణ రంగంలో క్రీయాశీలకంగా రాణిస్తున్న ఆల్టెక్ (Altec) వోక్టివ్ డ్యుయో వర్షన్‌లో ఐపాడ్ డాక్‌ను డిజైన్ చేసింది. ఇతర ఐపోడ్ డాక్‌లతో పోలిస్తే ఆల్టెడ్ డిజైన్ చేసిన ‘M202 వోక్టివ్ డ్యుయో’ ఐపోడ్ డాక్ స్పీకర్ సిస్టం ఉత్తమమైన పనితీరు కలిగి ఉంటుంది.

ఆకట్టకునే అంశాలు:

ఆకర్షణీయమైన డిజైన్, మన్నికైన ఉడెన్ ఫినిష్, క్లారిటీతో కూడిన సౌండ్‌ను విడుదల చేసే నియోడైమియమ్ డ్రైవర్స్, ఇండికేటర్ వ్యవస్థ, మ్యూజిక్ మిక్స్ అప్లికేషన్, సులువైన ఆపరేటింగ్, యూఎస్బీ పోర్ట్ సౌలభ్యత, అలారమ్ క్లాక్, రిమోట్ కంట్రోల్ వ్యవస్థ...

పనితీరు:

ఈ డాక్ స్పీకర్ సిస్టంలో ఒకే సారి రెండు ఐపోడ్ లేదా ఐఫోన్ పరికరాలను అమర్చుకోవచ్చు. ఇందుకోసం సిస్టంలో రెండు డాక్‌లను ఏర్పాటు చేశారు. డాక్ సిస్టం ముందు భాగంలో నిక్షిప్తం చేసిన రెండు నియోడైమియమ్ డ్రైవర్స్ స్టీరియోఫోనిక్ సౌండ్

అవుట్‌పుట్‌ అందిస్తాయి. ఏర్పాటు చేసిన ఇండికేటర్ లైట్ సిగ్నల్ వ్యవస్థ డివైజు పనితీరును స్పష్టం చేస్తుంది.

యూఎస్బీ పోర్ట్ ఆధారితంగా ఈ స్పీకర్ డాక్‌ను ఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. క్లారిటీతో కూడిన మన్నికైన ఆడియోను ఈ డాక్ సిస్టం విడుదల చేస్తుంది. త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల కాబోతున్న ‘M202 వోక్టివ్ డ్యుయో’ డాక్ స్పీకర్ ధర రూ.7000 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot