దుమ్ము రేపుతున్న బ్లూటూత్ హెడ్‌ఫోన్!!

Posted By: Prashanth

దుమ్ము రేపుతున్న బ్లూటూత్ హెడ్‌ఫోన్!!

 

డిజిటల్ లైఫ్‌స్టైల్ ప్రపంచంలో పేరు ప్రతిష్టలు గడించిన ‘Amkette’ సంస్ధ వినూత్న సాంకేతకతతో బ్లూటూత్ ఆధారిత హెడ్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘ట్రూ‌బీట్స్ ఎయిర్’ మోడల్‌గా విడుదలవుతున్న ఈ హెడ్‌ఫోన్‌ను బ్లూటూత్ సౌలభ్యత కలిగిన అన్ని గ్యాడ్జెట్లకు జత చేసుకోవచ్చు.

మ్యూజిక్ అదే విధంగా కాల్స్ రిసీవ్ చేసుకున్న సందర్భంలో క్రిస్టల్ క్లియర్ సౌండ్ అనుభూతిని శ్రోత ఆస్వాదిస్తాడు. చెవులకు సౌకర్యవంతంగా ఇమిడే విధంగా హడ్‌ఫోన్ ఇయర్‌బడ్‌లను డిజైన్ చేశారు. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన సులువైన వాల్యుమ్ కంట్రోల్స్ మ్యూజిక్ స్థాయిని వినసొంపైన బాణిలో ఉంచుతాయి. బ్లూటూత్ ఆధారిత టాబ్లెట్ పీసీలు, ఐఫోన్స్, బ్లాక్‌బెర్రీ సెల్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్‌లకు ఈ హెడ్‌సెట్ సహకరిస్తుంది.

హై స్టాండర్డ్ ఫీచర్లను ఈ బ్లూటూత్ ఆధారిత ఆడియో గ్యాడ్జెట్‌లో నిక్షిప్తం చేసినట్లు బ్రాండ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇండియన్ మార్కెట్లో అతి త్వరలో విడుదల కాబోతున్న Amkette ట్రూబీట్స్ హెడ్‌ఫోన్ ధర రూ.2,400 . అంతరాయంలేని క్వాలిటీ ఆడియోను కోరుకునే వారికి ఈ ఆడియో డివైజ్ పూర్తి స్థాయిలో దోహదపడుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot