సోనీ నుంచి దీ బెస్ట్ వాక్‌మెన్!!

Posted By: Prashanth

సోనీ నుంచి దీ బెస్ట్ వాక్‌మెన్!!

 

ఉత్తమ క్వాలటీ ఆడియో ఉత్పత్తులను మ్యూజిక్ ప్రపంచానికి చేరవచేసిన సోనీ మరో ఆవిష్కరణకు ముస్తాబవుతోంది. వాక్‌మెన్ సిరీస్ నుంచి సరికొత్త వేరియంట్‌లో NWZ-Z1050 మ్యూజిక్ ప్లేయర్‌ను ఈ ఆల్‌ టైమ్ ఫేవరెట్ డిజైన్ చేసింది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఈ ప్రత్యేకమైన మ్యూజిక్ ప్లేయర్ ఉన్నతమైన సౌండ్ నాణ్యతతో సంగీతాన్ని విడుదల చేస్తుంది. స్మార్ట్ ఫోన్‌ను తలపించే ఈ మ్యూజిక్ ప్లేయర్ ముఖ్య ఫీచర్లు:

* 4.3 అంగుళాల టచ్ స్ర్కీన్,

* డ్యూయల్ కోర్ సామర్ధ్యం గల 1 GHz టెగ్రా 2 ప్రాసెసర్,

* ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం,

* ఎస్- మాస్టర్ డిజిటల్ యాంప్లిఫైర్,

* క్లియర్ స్టీరియో, క్లియర్ బాస్, ఉత్తమ శ్రేణి డిజిటల్ సౌండ్,

* ఎక్స్ లౌడ్ -స్పీకర్ సిస్టం,

* బ్లూటూత్ సౌలభ్యత,

* వై-పై సపోర్ట్,

* రెగ్యులర్ స్పీకర్లతో పాటు హెడ్ ఫోన్స్, హై-ఫై సిస్టమ్స్ అదేవిధంగా కార్ స్టీరియోలకు ఈ వాక్ మెన్ ను జత చేసుకోవచ్చు.

* 16జీబి స్టోరేజ్ సామర్ధ్యం.

* మ్యూజిక్ సైట్‌ల నుంచి వేల పాటలను స్ట్రీమ్ చేసుకునే సౌలభ్యత,

భారతీయ మార్కెట్లోకి సోనీ Z సిరీస్ వాక్‌మెన్ మే లేదా జూన్‌లో అందుబాటులోకి రానుంది. అంచనా ధర రూ.15,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot