సెకనుకో ఫిలింగ్ సరికొత్త ‘యాప్రియాన్’తో..!!

Posted By: Staff

సెకనుకో ఫిలింగ్ సరికొత్త ‘యాప్రియాన్’తో..!!


"వైర్‌లెస్ మ్యూజిక్ పరికరాలకు ప్రస్తుత మార్కెట్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రతి క్షణం కొత్తదనాన్ని కోరుకుంటున్న సాంకేతిక వినియోగదారులు ప్రస్తుత ట్రెండ్‌ను అనుసరిస్తూ వైర్‌లెస్ గ్యాడ్జెట్ల వైపు మక్కువ కనబర్చుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఆడియో పరికరాల తయారీ సంస్థ ‘యాప్రియాన్’ సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. ‘జోనా హాల్’ (Zona HAL) పేరుతో వినూత్న మ్యూజిక్ పరికరాన్ని బ్రాండ్ రూపొందించింది. ఈ నూతన ఆవిష్కరణ సాయంతో నాణ్యమైన సంగీతాన్నిసులవైన విధానం ద్వారా ఆస్వాదించవచ్చు."

ఫీచర్లు క్లుప్తంగా:

- ఆడియో ప్లేయర్లతో పాటు కంప్యూటర్ పరికరాలకు ఈ మ్యూజిక్ పరికరాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. యూఎస్బీ ఎక్స్‌టెన్షన్ సాయంతో ఈ ప్రక్రియ సాధ్యమవుతుంది.

- ఎక్స్‌టెన్‌షన్ విధానం ద్వారా ఏ గదిలోనుంచైనా మ్యూజిక్‌ను నాణ్యమైన అనుభూతితో ఆస్వాదించవచ్చు.

- వ్యయ ప్రయోసలతో పెద్ద పెద్ద స్పీకర్లను ఈ గదిలోంచి ఆ గదిలోకి మార్చుకునే బెడద ‘జోనా హాల్’ స్పీకర్ల రాకతో మీకిక తప్పినట్లే.

- త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ మ్యూజిక్ పరికరం ధర రూ.6,700 ఉంటుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot