'ఆపిల్' క్రిస్‌మస్ గిప్ట్ ఏమై ఉంటుందబ్బా..?

Posted By: Prashanth

'ఆపిల్' క్రిస్‌మస్ గిప్ట్ ఏమై ఉంటుందబ్బా..?

 

టెక్నాలజీ రంగంలో ఐప్యాడ్, ఐఫోన్, టాబ్లెట్స్ ద్వారా కొత్త ఒరవడిని సృష్టించిన దిగ్గజ కంపెనీ ఆపిల్ డిసెంబర్‌లో క్రిస్‌మస్ సంబరాలకు ముస్తాబైంది. దక్షణాది దేశాలైన  లండన్, కెనడాలతో పాటు యూరప్‌లో మరికొన్ని దేశాలకు ఆపిల్ ప్రత్యేకంగా 12 రోజుల క్రిస్ మస్ అప్లికేషన్‌ని విడుదల చేసింది.

ఆపిల్ హెడ్ ఆఫీసు కుపెర్టినోలో ఈ ఆప్లికేషన్‌ని రూపొందించడమే కాకుండా, గత కొన్ని సంవత్సరాలుగా దీనిని ఒక ట్రేడిషన్‌గా భావిస్తున్నారు. డిసెంబర్ 26 నుండి జనవరి 6 వరకు జరిగే క్రిస్ మస్ సంబరాలను ఆపిల్ ఉద్యోగులు అత్యంత వైభవంగా జరుపుకోవడమే కాకుండా వారికి నచ్చిన తోటి సన్నిహితులకు, స్నేహితులకు గిప్ట్స్‌ని పంచుకుంటారు.

ఈ అప్లికేషన్‌కి సంబంధించిన పూర్తి సమాచారం ఆపిల్ ఇంకా విడుదల చేయలేదు. అందుకు కారణం ఆపిల్ కస్టమర్స్‌కి ఓ కొత్త అనుభూతిని కలిగించేందుకేనని అన్నారు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయ బద్దంగా ఈ పండుగను చేసుకుంటున్న ఆపిల్ గతంలో ఫ్రీ సాంగ్స్, వీడియోస్, అప్లికేషన్స్, బుక్స్‌ని  విడుదల చేసింది.

ఐతే ఆపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ఫెస్టివ్ ఛీర్‌ని ప్రపంచంలో కొన్ని దేశాలు మిస్ కాబోతున్నాయి. ప్రపంచంలో ఏయేదేశాలు ఈ ఆపిల్  క్రిస్‌మస్ ఫెస్టివ్ ఛీర్‌ని పొందలేక పోతున్నారో వారికోసం ఆపిల్ ప్రత్యేకంగా ఆపిల్ వెబ్‌సైట్  ఐట్యూన్స్ సెక్షన్‌లో 'స్పెషల్ గిఫ్ట్'ని అందించనుంది. ప్రస్తుతానికి ఆపిల్ కంపెనీ లండన్‌లో క్రిస్‌మస్ ఫెస్టివ్ అప్లికేషన్‌ని ఆపిల్ ఐట్యూన్స్‌లో విడుదల చేసింది. దానికి సంబంధించిన లింక్‌(http://itunes.apple.com/gb/app/itunes-12-days-of-christmas/id479672983?mt=8)ని వన్ ఇండియా మొబైల్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot