ఆపిల్ హెయిర్ బ్యాండ్ ‘హెడ్‌ఫోన్’!!

Posted By: Super

ఆపిల్ హెయిర్ బ్యాండ్ ‘హెడ్‌ఫోన్’!!

 

ఆపిల్ గ్యాడ్జెట్లకు స్టైల్ పెద్ద ప్లస్ పాయింట్. సాధరాణంగా ఆపిల్ హెడ్ ఫోన్లను ఆపిల్ ప్రుడక్ట్ వినియోగదారులే ఎంపిక చేసుకుంటారు. తాజాగా ఆపిల్ విడుదల చేసిన ‘హెయిర్ బ్యాండ్’ (hairband) హెడ్‌ఫోన్స్ ఆకర్షణీయమైన రూపు రేఖలతో మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ప్రముఖ డిజైనర్ సాంగ్ హూన్ లీ ఈ హెడ్‌ఫోన్లను డిజైన్ చేశారు. ఈ ఆడియో గ్యాడ్జెట్ ఆపిల్ ప్రేమికులకు మాత్రమే కాదు.. మ్యూజిక్ ప్రేమికులందరికి నచ్చుతుంది. స్లీక్ ఆల్యూమినియమ్ ఫినిష్‌తో క్లాసీ లుక్‌లో కనిపించే ఈ హెడ్‌ఫోన్లు రెండు వైపులా ఆపిల్  లోగోతో మరింత హుందాతనాన్ని సంతరించుకుంటాయి.

సౌకర్యవంతమైన ఇయర్ కప్స్ చెవులకు ఎటువంటి ఒత్తిడిని కలిగించవు. హెడ్ ఫోన్లలో ఏర్పాటు చేసిన టచ్ వాల్యుమ్ కంట్రోలింగ్ వ్యవస్థ వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తుంది. మన్నికైన సౌండ్ వ్యవస్థను ఈ హెడ్‌ఫోన్ సిస్టంలో నిక్షిప్తం చేశారు. పొందుపరచిన నాయిస్ ఐసోలేషన్ వ్యవస్థ అంతరాయంలేని ఆడియోను అందిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot