భారత్‌లోకి యాపిల్ ఐట్యూన్స్ స్టోర్

Posted By: Prashanth

భారత్‌లోకి యాపిల్ ఐట్యూన్స్ స్టోర్

 

యాపిల్ తమ ఐట్యూన్స్ స్టోర్ సర్వీసులను భారత్‌లో ప్రారంభించింది. దీంతో, భారత్‌ కస్టమర్లు ఇక నుంచి 2 కోట్లకు పైగా పాటలు, ఇతరత్రా చిత్రాలను ఐట్యూన్స్ నుంచి రూపాయి మారకంలో కొనుగోలు చేయొచ్చని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చని యాపిల్ తెలిపింది. పాట ధర రూ. 9 నుంచి రూ.15 వరకు ఉంటుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. హెచ్‌డీ వెర్షన్ రేటు రూ. 490గాను, స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 290గాను ఉంటుంది. కావాలంటే యూజర్లు హెచ్‌డీ వెర్షన్‌ను రూ. 120కి, స్టాండర్డ్ వెర్షన్‌ను రూ. 80కి అద్దెకి తీసుకోవచ్చు. ఐట్యూన్స్ స్టోర్‌లో అంతర్జాతీయ చిత్రాలు కూడా లభిస్తాయి. తొలి 3-4 నెలల్లో నెలవారీగా 5-6 లక్షల డౌన్‌లోడ్లు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఐస్టోర్‌లో భారీగా ట్యూన్లు అప్‌లోడ్ చేసిన సోనీ మ్యూజిక్ ప్రెసిడెంట్ (భారత్, మధ్యప్రాచ్యం) శ్రీధర్ సుబ్రమణ్యం చెప్పారు. ఐట్యూన్స్ స్టోర్‌ను తాజాగా రష్యా సహా మరో 55 దేశాల్లో యాపిల్ ప్రవేశపెట్టింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot