ఆపిల్ అభిమానులకు దసరా ‘బోనాంజా’!!

Posted By: Staff

ఆపిల్ అభిమానులకు దసరా ‘బోనాంజా’!!

ఆపిల్ అర్ధంతర నిర్ణయం పై పుకార్లు.. షికార్లు చేశాయి.., అభిమానులు ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు.., అంతిమంగా విశ్లేషకులు చెప్పిన అంచనాలే వాస్తవమయ్యాయి. దిగ్గజ ఆపిల్ వ్యాపార వృద్ధికి దోహదపడిన మ్యాజిక్ పరికరాలు ‘ఆపిల్ ఐపోడ్ షఫుల్’ (Apple ipod shuffle) మరియు ‘ఐపోడ్ క్లాసిక్’ (iPod Classic) అమ్మకాలు మరికొద్ది రోజుల్లో నిలిచిపోనున్నాయన్న చేదు వార్తను జీర్ణించుకోలేకపోతున్న అభిమానులకు ‘ఆపిల్’ డబుల్ ధమాకాతో ఊరటనిచ్చింది. పండుగ తీపికబురుగా ‘ఆపిల్’ రెండు సరికొత్త ఐపోడ్ పరికరాలను మార్కెట్లో విడుదల చేసింది.

‘ఆపిల్ ఐపోడ్ నానో’ (Apple iPod Nano), ఆపిల్ ఐపోడ్ టచ్ (Apple iPod touch) వర్షన్లలో రెండు గ్యాడ్జెట్లను ఆపిల్ లాంఛ్ చేసింది. అధునాతన సాంకేతిక ఫీచర్లతో డిజైన్ చేయబడిన ఈ మ్యూజిక్ ప్లేయర్లు నాన్ స్టాప్ సంగీతాన్ని స్పష్టతతో వినియోగదారునికి అందిస్తాయి. క్లుప్తంగా వీటి ఫీచర్లను పరిశీలిద్దాం...

ఐపోడ్ నానో ఫీచర్లు క్లుప్తంగా:

- మల్టీ టచ్ డిస్‌ప్లే వ్యవస్థతో రూపుదిద్దుకున్న ఈ ఐపోడ్‌లో ఫిట్‌నెస్ ట్రాకింగ్ అప్లికేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ అప్లికేషన్‌లోని ట్రాకింగ్ వ్యవస్థ మీ నడకును, పరుగును లెక్క కడుతుంది.

- 3.6 అంగుళాలు పొడవు, 1.5 అంగుళాల వెడల్పు, 36.4 గ్రాములు బరువు కలిగిన ధారుడ్యంతో ఐపోడ్ నానో డిజైన్ చేయబడింది.

- 8జీబీ సామర్ధ్యం గల ‘నానో’లో 14,000 పాటలను స్టోర్ చేసుకోవచ్చు.

- శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్ధ 16 గంటల వీడియో ప్లేబ్యాక్, బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

- ఈ ఐపోడ్‌లో ఏర్పాటు చేసిన మెనూ ఇతర ఫాంట్లు, లావాదేవీలు సమయంలో మాట్లాడే విధంగా ఆధునిక వ్యవస్థను డిజైన్ చేశారు.

- 2.2 అంగుళాల డిస్‌ప్లే వ్యవస్థ 240 x 376 పిక్సల్ రిసల్యూషన్ కలిగి హై రిసల్యూషన్ విజువల్స్ అందిస్తుంది.

- ఇండియన్ మార్కెట్లో ఐపోడ్ నానో ధర రూ. 10,000


ఆపిల్ ఐపోడ్ టచ్ ఫీచర్లు :

- ఐపాడ్ టచ్‌లో పొందుపరిచి ‘ఐక్లౌడ్’ (iCloud) వ్యవస్థ సౌలభ్యతతో, అంతర్జాలం (ఇంటర్నెట్) నుంచి మీడియా లైబ్రరీని ఎటువంటి అంతరాయం లేకుండా ఐపాడ్ టచ్‌లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

- 4.4 అంగుళాల పొడవు, 2.32 అంగుళాల వెడల్పు 101 గ్రాముల బరువు కలిగిన ధారుడ్యంతో ఐపోడ్ టచ్ డిజైన్ కాబడింది.

- పటిష్ట బ్యాటరీ వ్యవస్థ 40 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ బ్యాకప్, 7గంటల వీడియో ప్లేబ్యాక్ బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

- 3.5 అంగుళాల మల్టీ టచ్ డిస్‌ప్లే, వీడియో రికార్డింగ్‌కు ఉపకరించే వీజీఏ కెమెరా వంటి వ్యవస్థలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

- 3.5 mm స్టిరీయో హెడ్ ఫోన్ మినీ జాక్‌ను, ఐపోడ్ టచ్‌లో ఏర్పాటు చేశారు.

- 8, 32 మరియు 64 జీబీ వర్షన్లలో ‘ఐపోడ్ టచ్’లు విడుదలవుతున్నాయి. వీటి ధరలను పరిశీలిస్తే ఐపోడ్ టచ్ 8జీబీ రూ.9,750, 32జీబీ రూ.14,750, 64జీబీ రూ.19650కి లభ్యమవతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot