‘ఆపిల్’ అర్ధంతర నిర్ణయం, అభిమానుల్లో విస్మయం..?

అక్టోబర్ 4న జరగబోయే ఓ కార్యక్రమంలో ‘ఆపిల్’ అధికారింకంగా ఈ ప్రకటనను వెలువరించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ‘ఆపిల్’ తీసుకున్ననిర్ణయం పై విశ్లేషకులు మరోలా స్పందిస్తున్నారు. అత్యాధునిక స్పెసిఫికేషన్లతో ‘ఆపిల్’ కొత్త సరీస్ ‘ఐపోడ్’లను విడుదల చేస్తున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
ఐపోడ్ స్కఫుల్ ఫీచర్లు క్లుప్తంగా:
- 1.4 అంగుళాల పొడవు, 1.24 వెడుల్పు ధారుడ్యంతో డిజైన చేయుబడిన ‘ఐపోడ్ స్కఫుల్’ కేవలం 12.5 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
- స్కిప్ ఫ్రీ ప్లేబ్యాక్, 20Hz నుంచి 20,000Hz ఫ్రీక్వెన్సీ వంటి అంశాలు నాణ్యమైన ఆడియో సౌండ్‌ను విడుదల చేసేందుకు ఉపకరిస్తాయి.
- పొందుపరిచిన యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ సౌలభ్యతతో 2జీడీ డేటాను స్టోర్ చేసుకోవచ్చు.
- ఐపోడ్‌లో ఏర్పాటు చేసిన పటిష్ట బ్యటారీ వ్యవస్థ 15 గంటల బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
- వివిధ వేరియంట్లలో లభ్యమవుతున్న ఐపోడ్ స్కఫుల్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.3,200 నుంచి రూ.4,200 వరకు ఉన్నాయి.
ఐపోడ్ క్లాసిక్ ఫీచర్లు క్లుప్తంగా:
- ఈ డివైజులో2.5 అంగుళాల ఎల్‌సీడీ కలర్ డిస్‌ప్లేను ఎల్‌ఈడీ బ్యాక్‌లైట్ సామర్ధ్యంతో పొందుపరిచారు. స్క్రీన్ రిసల్యూషన్ 240 పిక్సల్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
- 40,000 పాటలతో పాటు 25,000 ఫోటోలను స్టోర్ చేసుకునే విధంగా స్టోరేజి సామర్ధ్యాన్ని కల్పించారు.
- 160జీబీ పటిష్ట హార్డ్‌డ్రైవ్ వ్యవస్థ వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తుంది.
- ఇండియన్ మార్కెట్లో ఐపోడ్ క్లాసిక్ ధర రూ.12,500గా నిర్థారించారు.


Click it and Unblock the Notifications








