‘ఐపోడ్ నానో’ లోపాన్ని సవరించుకోండి - ఆపిల్

Posted By: Staff

‘ఐపోడ్ నానో’ లోపాన్ని సవరించుకోండి - ఆపిల్

 

అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘ఆపిల్’ వినియోగదారులు భద్రతను దృష్టిలో ఉంచుకుని తాను 2005లో విడుదల చేసిన ‘మొదటి జనరేషన్ ఐపోడ్ నానో’ గ్యాడ్జెట్లో స్వల్ప మార్పు చేర్పులు చేయునుంది.

‘ఐపోడ్ నానో’లో పొందుపరిచిన బ్యాటరీ సాంకేతిక కారణాల చేత ‘ఓవర్ హీట్’ (overheat)ను విడుదల చేసే ప్రమాదముందని సంస్థ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ఆరోగ్యం పై దుషప్రభావం చూపే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమస్య కేవలం సెప్టంబర్ 2005, డిసెంబర్ 2006 మధ్య అమ్ముడైన ఐపోడ్ నానో గ్యాడ్జెట్లలోనే తలెత్తుతున్నట్లు సంస్థ అధికార వర్గాలు గుర్తించాయి.

ముందుచూపుతో వ్యవహరించిన ‘ఆపిల్’ సమస్యను పరిష్కారించే యోచనలో తాజా ప్రకటనను వెలువరించింది. సెప్టంబర్ 2005, డిసెంబర్ 2006 మధ్య ‘ఐపోడ్ నానో’ను కొనుగోలు చేసిన వినియోగదారులు ఏ విధమైన ఖర్చు లేకుండా సంబంధిత ఆపిల్ స్టోర్లలో సమస్యను పరిష్కరించుకునే విధంగా చర్యలు తీసుకంది.

తొలత వినియోగదారుడు ‘ఆపిల్ సైట్’లోకి ప్రవేశించి సంబంధిత సమచారాన్ని పొందుపరచాల్సి ఉంటుంది. నిబంధనలు వర్తించిన నేపధ్యంలో సంబంధిత స్టోర్లలో ‘ఐపోడ్ నానో’ను అప్పగించాల్సి ఉంటుంది. 6 వారాల వ్యవధిలో మీ గ్యాడ్జెట్ తిరిగి రిప్లేస్ చేయుబుడుతుంది. మరింత సమాచారాన్ని సంబంధిత ఆపిల్ సెంటర్లో తెలుసుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot