మిమ్మల్ని నిద్రలేపి మ్యూజిక్ వినిపిస్తుంది..?

Posted By: Staff

మిమ్మల్ని నిద్రలేపి మ్యూజిక్ వినిపిస్తుంది..?

 

ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీల నిర్మాణంలో మార్గదర్శక సంస్థగా ప్రపంచ గుర్తింపు పొందిన ‘ఆర్చోస్’ (ARCHOS) సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. అలనాటి రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత చేరువ చేస్తూ హోమ్ బేసిడ్  ‘ఆండ్రాయిడ్ ఆధారిత వెబ్ రేడియో డివైజ్’ను  ఆర్చోస్ డిజైన్ చేసింది. స్టాండర్డ్ రేడియోకు ఏ మాత్రం తీసుపోని విధంగా ఈ వెబ్ రేడియోను రూపిందించారు. పోర్టబుల్ మ్యూజిక్ బాక్స్‌లా కనిపించే ఈ స్లిమ్ డివైజ్  వై-ఫై ఇంటర్నెట్ కనెక్టువిటీ సౌలభ్యతతో రేడియో కంటెంట్ అదే విధంగా మ్యూజిక్ కంటెంట్‌ను స్ట్ర్రీమ్ చేసుకుంటుంది.

ఆపరేట్ చేసే విధానం:

ఆర్చోస్ 35 హోమ్ కనెక్ట్ వెబ్ రేడియోను ప్రత్యేకించి ఇంటి అవసరాల కోసం రూపొందించారు. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ లేదా  టాబ్లెట్ పీసీలకు వై-ఫై సౌలభ్యతతో ఈ వెబ్ రేడియోను కనెక్ట్ చేసుకోవచ్చు. రేడియో నియంత్రణకు సంబంధించి రిమోట్ కంట్రోల్ అప్లికేషన్‌ను స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ పీసీలోకి డౌన్‌లోడ్ చేసుకోవల్సి వస్తుంది. ట్యూన్ ఇన్ రేడియో ప్రో అప్లికేషన్ అదే విధంగా ఆలారమ్ క్లాక్ అప్లికేషన్లను డివైజ్ లో నిక్షిప్తం చేశారు. ఈ అలారమ్ అప్లికేషన్ మిమ్మల్ని పొద్దున్నే మేల్కొల్పి వెను వెంటనే మీకు నచ్చిన సంగీతాన్ని ప్లే చేస్తుంది.

ముఖ్య ఫీచర్లు:

హై క్వాలిటీ సౌండ్ వ్యవస్థను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,  అలారమ్ క్లాక్, ట్యూన్ ఇన్ రేడియో ప్రో అప్లికేషన్,  హై స్పీడ్ వై-ఫై ఇంటర్నెట్ కనెక్టువిటీ, 50,000 వెబ్ రేడియ్ స్టేషన్లను బ్రౌజ్  చేసుకునే సౌలభ్యత, డివైజ్‌లో  సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్లను బ్రౌజ్ చేసుకోవచ్చు, ధర రూ.8,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting