‘అరీవా’తో అంతరాయానికి చెల్లు!!

Posted By: Super

‘అరీవా’తో అంతరాయానికి చెల్లు!!

 

సంగీతాన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో మ్యూజిక్ ఓ భాగమైపోయింది. విశ్రాంతి సమయాల్లో, పని సమాయల్లో, ప్రయాణ సందర్భంలో సంగీతాన్ని వింటూ కాలక్లేపం చేస్తున్నారు. శ్రోతల ఉత్సకత నేపధ్యంలో వివిధ రకాల మ్యూజిక్ గ్యాడ్జెట్లు విడుదలవుతున్నాయ. వైర్ల ఆధారిత మ్యూజిక్ గ్యాడ్జెట్లకు స్వస్తి పలుకుతూ ‘వైర్‌లెస్’ వ్యవస్థ అందుబాటులోకి రావటంతో మ్యూజిక్ గ్యాడ్జెట్ల విప్లవం కొత్త జవసత్వాలను నింపుకుంది.

ఉరుకుల పరుగుల యాంత్రిక యుగంలో ‘వైర్స్’ ఆధారితంగా పనిచేసే మ్యూజిక్ హెడ్‌సెట్లు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. వీటి స్థానాన్ని భర్తీ చేస్తూ ఆవిర్భవించిన ‘బ్లూటూత్’ ఆధారిత వైర్‌లెస్ హెడ్‌సెట్లు సౌకర్యవంతమైన గ్యాడ్జెట్లుగా ముద్రపడ్డాయి. ప్రముఖ మ్యూజిక్ గ్యాడ్జెట్ల తయారీదారు ‘అరీవా’(Arriva) తాజాగా సరికొత్త లియో వైర్‌లెస్ బ్లూటూత్ హెడ్‌సెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. హెల్మెట్, టోపి మాదిరిగా తలకు ఈ హెడ్‌సెట్‌ను ధరించుకోవల్సి ఉంటుంది. చెవులకు సౌకర్యవంతంగా ఇమిడే విధంగా హెడ్‌సెట్ ఇయర్ బడ్‌లను డిజైన్ చేశారు.

గ్యాడ్జెట్ ముఖ్య కంట్రోల్ వ్యవస్థను తల వెనుక భాగంలో ఉండే విధంగా రూపకల్పన చేశారు. ఈ వ్యవస్థలో మూడు బటన్లను ఏర్పాటు చేశారు. అత్యాధుని సౌండ్ వ్యవస్థను ఈ మ్యూజిక్ పరికరంలో పొందుపిరిచారు. రద్దీ ట్రాఫిక్‌లో సైతం అవతలి వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌ను నిర్భయంగా లిఫ్ట్ చేసి సౌకర్యవంతంగా మాట్లాడుకోవచ్చు. ఖచ్చితమైన క్లియర్ వాయిస్‌ను అంతిమంగా ఈ పరికరం అందిస్తుంది.

140mAh సామర్ధ్యం గల శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను పరికరంలో పొందుపరిచారు. యూఎస్బీ పోర్టు ఆధారితంగా అరగంటలో బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. స్టాండ్ బై సామర్ధ్యం 20 రోజులు. ఏర్పాటు చేసిన ఇండికేటర్ లైట్ వ్యవస్థ ఛార్జింగ్ స్థాయిని తెలయజేస్తుంది. భారతీయ మార్కెట్లో అతి త్వరలో విడుదల కానున్న అరీవా లియో బ్లూటూత్ హెడ్‌సెట్ ధర రూ. 3,500 ఉండోచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot