అసస్ న్యూ ఇయర్ షాక్..?

Posted By: Prashanth

అసస్ న్యూ ఇయర్ షాక్..?

 

న్యూ ఇయర్ సంబరాల్లో మునిగి తేలుతున్న సాంకేతిక ప్రియులకు అంతర్జాతీయ కంప్యూటింగ్ పరికరాల బ్రాండ్ ‘అసస్’ షాకిచ్చింది. ఆధునిక టెక్నాలజీని అనుసరిస్తూ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ల ఉత్పాదనల పై దృష్టిసారిస్తూ వస్తున్న అసస్ తాజాగా మ్యూజిక్ పరికరాల సెగ్మంట్‌లోకి ప్రవేశించింది. యూఎస్బీ సపోర్ట్‌తో నడిచే రెండు సరికొత్త మ్యూజిక్ డివైజ్‌లను 2012 కానుకగా బ్రాండ్ విడుదల చేసింది. ‘MS-100 యూఎస్బీ స్టీరియో స్పీకర్ సెట్’, ‘HS-W1 వైర్‌లెస్ హెడ్‌సెట్’గా మీ ముందుకొచ్చిన ఈ సౌండ్ గ్యాడ్జెట్స్ ముఖ్య విశేషాలు:

MS-100 యూఎస్బీ స్టీరియో స్పీకర్‌ సెట్:

* యూఎస్బీ 2.0, 3.0 వర్షన్ కనెక్టువిటీ వ్యవస్థలను స్పీకర్‌లో నిక్షిప్తం చేశారు, * డివైజ్‌లో దోహదం చేసిన 54 mm స్పీకర్ డ్రవైర్లు మన్నికైన సౌండ్‌ను ఉత్పత్తి చేస్తాయి, డ్రైవర్స్ సౌండ్ ఉత్పత్తి సామర్ధ్యం 93 డెసిబల్స్, * ఉత్తమమైన సౌండ్‌ను ఈ స్పీకర్ సెట్ విడుదల చేస్తుంది, * ఎటువంటి ఆడిషనల్ డ్రైవర్ల సాయం లేకుండా విండోస్ 7, విండోస్ విస్టా వో‌ఎస్ డివైజ్‌లకు స్పీకర్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు, * నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ అంతరాయాలను దరి చేరనివ్వదు, * ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన 100 Hz – 20 KHz.

HS-W1 వైర్‌లెస్ హెడ్‌సెట్:

* బరువు 65 గ్రాములు, * ఆడ్వాన్సుడ్ 2 - వే డిజిటల్ ట్రాన్స్‌మిషన్ వైర్‌లెస్ టెక్నాలజీని హెడ్‌సెట్‌లో ఏర్పాటు చేశారు, * హెడ్‌సెట్ ట్రాన్స్‌మిషన్ సాంధ్రత 15 మీటర్లు, * డివైజ్‌‌కు ఇంటిగ్రేట్ చేసిన సౌండ్ ఈక్వలైజర్ , 40mm డ్రైవర్ మన్నికైన పనితీరును ప్రదర్శిస్తాయి, * నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ అంతరాయాలను దరి చేరనివ్వదు, * ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన 20 ~ 20 KHz వరకు, సమర్దవంతమైన బ్యాకప్ నిచ్చే లితియమ్ పాలిమర్ బ్యాటరీని స్పీకర్ సెట్‌కు జత చేశారు.

అసస్ రూపొందించిన మ్యూజిక్ పరికరాల స్పెసిఫికేషన్‌లు ఆకట్టుకునే రీతిలో ఉన్నాయి. వీటిని ఎంపిక చేసుకున్న శ్రోత ఖచ్చితమైన క్రిస్టల్ క్లియర్ సౌండ్ అనుభూతిని ఆస్వాదిస్తాడు. ఇండియన్ మార్కెట్లో అసస్ రూపొందించిన స్పీకర్ల ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot