సురక్షిత సైకిల్ రైడింగ్ ఇప్పుడు ‘ఆడిబుల్ రష్’ సంగీత స్పీకర్లతో..!!

Posted By: Super

సురక్షిత సైకిల్ రైడింగ్ ఇప్పుడు ‘ఆడిబుల్ రష్’ సంగీత స్పీకర్లతో..!!

ఉదయం సైకిల్ పై జాగింగ్‌కు వెళ్లే వారు జాగింగ్‌లో బోర్ ఫీలవ్వకుండా ‘ఇయర్ ఫోన్స్’ సాయంతో మ్యూజిక్‌ను ఆస్వాదిస్తుంటారు. పలు సందర్భాల్లో ఈ ప్రక్రియ ప్రమాదాలకు తావిస్తుంటుంది. ఇయర్ ఫోన్లను చెవిలో పెట్టుకుని సైకిల్ రైడిండ్ చెయ్యటం వల్ల వాహాన శబ్థాలను పసిగట్టడం కష్టతరమవుతుంది.

సురక్షిత మ్యూజిక్‌ను ఆస్వాదిస్తూ, సురిక్షితంగా సైకిల్‌ను రైడ్ చేసే విధంగా ‘ఆడిబుల్ రష్’ సంస్థ ‘బైస్కిల్ మ్యూజిక్ డాక్ సిస్టమ్’ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. అధునాతన ఫీచర్లతో డిజైన్ చేయుబడ్డ ఈ స్టీరియో వ్యవస్థను సైకిళ్లతో పాటు ఇతర జాగింగ్ పరికరాలకు జత చేసుకోవచ్చు. సైకిల్ హ్యాండిల్ బార్ భాగంలో ఏర్పాటు చేసే బ్యాగ్‌లో, మ్యూజిక్ డాక్ స్టేషన్‌తో పాటు సంబంధిత ఆడియో ప్లేయర్‌ను అమర్చుకోవచ్చు.

ఇక డాక్ స్టేషన్‌లోని ఫీచర్లను పరిశీలిస్తే రెండు అత్యాధునిక స్పీకర్లతో సౌండ్ సిస్టమ్ డిజైన్ చేయుబడంది. పొందుపరిచిన 12వోల్ట్ డిజిటల్ యాంఫ్లీఫైర్ వ్యవస్థ మన్నికైన ఆడియో అనుభూతిని వినియోగదారుడికి అందిస్తుంది. ఐఫోన్, ఐపాడ్ పరికరాలతో పాటు ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లకు ఈ డాకింగ్ సిస్టమ్‌ను జత చేసుకోవచ్చు.

‘ఆడిబుల్ రష్’ ప్రప్రధమంగా రూపొందించిన సురక్షిత సైకిల్ మ్యూజిక్ డాక్ సిస్టమ్ పై ఇప్పటికే మార్కెట్లో అంచనాలు నెలకున్నాయి. ఇంట్లో పొందే మ్యూజిక్ అనుభూతిని, ఇప్పుడు మీరు సైకిల్ ప్రయాణంలోనూ కొనసాగించవచ్చు. సమీప ఆన్ లైన్ స్టోర్లలో లభ్యమవుతన్న ఈ మల్టీ పర్పస్ డాక్ వ్యవస్థల కోసం త్వరపడండి మరి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot