శ్యామ్‌సంగ్ గెలక్సీ టాబ్లెట్ ముఖ్య సమాచారం!!

Posted By: Prashanth

శ్యామ్‌సంగ్ గెలక్సీ టాబ్లెట్ ముఖ్య సమాచారం!!

 

శ్యామ్‌సంగ్ గెలక్సీ టాబ్లెట్ పీసికి ఫిట్ అయ్యే విధంగా ఆడియో డాకింగ్ స్టేషన్ ను iLuv సంస్థ డిజైన్ చేసింది. iSM524 ఆర్ట్ స్టేషన్ ప్రో (ArtStation Pro)గా విడుదల కాబోతున్న ఈ స్పీకర్ డాక్ చూడటానికి హెవీగా కినిపించినా పనితీరు మాత్రం బేషుగ్గా ఉంటుంది. 8.9, 10.1 వర్షన్ లలో విడుదలైన శ్యామసంగ్ గెలక్సీ టాబ్లెట్ పీసీలకు ఈ డాక్ స్పీకర్ సిస్టంను జత చేసుకోవచ్చు. టాబ్లెట్ పీసీని డాక్ లో అమర్చిన వెంటనే ఆడియో ప్రక్రియ ప్రారంభమవుతుంది.

బ్యాటరీ ఆధారితంగా స్పీకర్ డాక్ సిస్టం పని చేస్తుంది. ఇందుకోసం స్పీకర్ సిస్టంలో 3.5 mm ఆడియో జాక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. డాక్ స్పీకర్ సిస్టంలో ఏర్పాటు చేసిన స్పీకర్లు ఆడియోను హై క్వాలిటీతో నాణ్యమైన కోణంలో అందిస్తాయి. స్పీకర్ సిస్టం ద్వారా విడుదలయ్యే సౌండ్ 320 డిగ్రీలు వ్యాప్తి చెందుతుంది. పూర్తి స్ధాయి వినోదాన్ని ఈ ఆడియో డివైజు ద్వారా పొందవచ్చు.

ముఖ్య ఫీచర్లు: మన్నికైన jAura సౌండ్ టెక్నాలజీని డాకింగ్ స్టేషన్ లో నిక్షిప్తం చేశారు. అదే విధంగా డాక్ సిస్టం కోసం డిజైన్ చేసిన ఇన్ ఫ్రారెడ్ రిమోట్ సిగ్నల్స్ ఆధారితంగా పని చేస్తుంది. భారతీయ మార్కెట్లో iLuv ఆడియో డాకింగ్ స్టేషన్ ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting