ఖుషి ఖుషిగా క్రిస్టమస్ అమ్మకాలు!!

Posted By: Super

ఖుషి ఖుషిగా క్రిస్టమస్ అమ్మకాలు!!

 

ప్రముఖ కంపెనీలన్ని ‘క్రిస్టమస్’ అమ్మకాల పై దృష్టి సారించాయి. కొత్త వర్షన్లలో వస్తువులను ప్రవేశపెట్టి  వినియోగదారులకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆడియో ఉత్పత్తుల సెక్టార్లో ఒకటైన ‘హెడ్ ఫోన్స్’ మార్కెట్ ఈ సీజన్లో ఆశాజనకంగా  ఉంటుందనే భరోసాను  పలు కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి.

ఆడియో గ్యాడ్జెట్ల సెక్టార్లోకి ప్రవేశించి దిగ్విజయంగా 45వ వసంతాన్ని పూర్తి చేసుకుంటున్న  ‘ఆడియో టెక్నికా’ క్రిస్టమస్ కానుకగా  లేటెస్ట్ ఎడిషన్  హెడ్ పోన్లను  విడుదలచేయనుంది.  వాటి వివరాలు సంక్షిప్తంగా తెలుసుకుందా..

- ‘CK 400i’ వర్షన్లో  టెక్నికా విడుదల చేయుబోతున్న సున్నితమైన, సౌకర్యవంతమైన   హెడ్ ఫోన్లు ఆపిల్  గ్యాడ్జెట్ల వాడకందారులకు మరింత లబ్ధి చేకూరుస్తాయి. బ్లూ, రెడ్, వైట్, పింక్ ఇతర వెరైటీ రంగుల్లో  డిజైన్ కాబడిన ఈ హెడ్ ఫోన్లను ఐపోడ్, ఐప్యాడ్ పరికరాలకు జత చేసుకోవచ్చు. ఇన్ లైన్ రిమోట్ కంట్రోలింగ్  సౌలభ్యత కలిగిన   ఈ హెడ్ ఫోన్లను  నోకియా, బ్లాక్ బెర్రీ, శ్యామ్ సంగ్  కంపెనీల స్మార్ట్ ఫోన్లకు అనుసంధానం చేసుకోవచ్చు.

- సిరీస్ లో రెండోదైన ‘CK 400 XP’ హెడ్ ఫోన్లను  సోని ఎరెక్సన్ ఎక్స్  పీరియా రేంజ్ ఫోన్ల కోసం రూపొందించారు.

-  టెక్నికా విడుదల చేయుబోతున్న మరో వర్షన్  హెడ్ ఫోన్స్  ‘CKS 55i’కు సంబంధించి  ఫీచర్లను పరిశీలిస్తే బ్లాక్, రెడ్, వైట్ కలర్ కాంబినేషన్లలో  డిజైన్ కాబడ్డాయి. కట్టిండ్ ఎడ్జ్  ఫీచర్, అత్యాధునిక సౌండ్  క్వాలిటీ, సమర్థవంతమైన బాస్ రెస్ పాన్స్  వంటి అంశాలు వినియోగదారుడికి మరింత దోహదపడతాయి. వివిధ మోడళ్లలో లభ్యమవుతున్న  ఈ హెడ్ ఫోన్ల ప్రారంభ  ధర రూ.2000 నుంచి ప్రారంభమై 8000 వరకు ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot