వింటే వదలరు!

Posted By: Prashanth

వింటే వదలరు!

 

మార్కెట్లో విడుదలకాబోతున్న సరికొత్త మ్యూజిక్ గ్యాడ్జెట్ ‘బీకాన్ ఆడియో ఫోనిక్స్ స్పీకర్’. ఈ ఉన్నత శ్రేణి పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ ప్రయాణ సందర్భాల్లో ఉత్తమ ఎంపిక. ఆకర్షణీయమైన డిజైనింగ్, అంతరాయంలేని క్వాలిటీ సౌండ్ అవుట్‌పుట్, మన్నికైన స్టీరియో స్పీకర్స్, ఉత్తమైన ఆడియో క్లారిటీ వంటి ప్రత్యేకమైన విశిష్టతలు ఈ గ్యాడ్జెట్‌లో ఒదిగి ఉన్నాయి. స్పీకర్‌ను చార్జ్ చేసుకునేందుకు యూఎస్బీ పోర్టును వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. స్పీకర్‌ను బ్లూటూత్ ఆధారిత ప్లేయర్‌లకు అనుసంధానించుకోవచ్చు. సాంధ్రత 10 అడుగులు. ఒకసారి సంపూర్ణంగా చార్జ్ చేస్తే 4గంటల 30 నిమిషాల బ్యాకప్ నిస్తుంది. స్పీకర్ పై భాగంలో ఏర్పాటు చేసిన కంట్రోలింగ్ బటన్స్ నియంత్రణకు తోడ్పడతాయి. ధర అంచనా రూ.5,000.

పూర్తి వినోదం!

ప్రముఖ ఆడియో పరికరాల తయారీ సంస్థ ఐరివర్ (iRiver) బీ100 పేరుతో మ్యూజిక్ ప్లేయర్‌ను డిజైన్ చేసింది. రెండు మెమరీ వర్షన్ లలో ఈ డివైజ్ లభ్యమవుతుందిన. ఒకటి 4జీబి, మరొకటి 8జీబి. స్మార్ట్‌ఫోన్ తరహాలో రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్ వినోదపు అవసరాలను పూర్తి స్ధాయిలో తీరుస్తుంది. కేవలం 80 గ్రాముల బరవుండే ఈ మల్టీమీడియా గ్యాడ్జెట్లో పుస్తకాలతో పాటు పీడీఎఫ్‌లను చదువుకోవచ్చు.

బీ100లో నిక్షిప్తం చేసిన ఫీచర్లు:

3.1 అంగుళాల టచ్‌స్క్రీన్, ఇన్‌బుల్ట్ మెమరీ 4జీబి మరియు 8జీబి, మైక్రో‌ఎస్డీ విధానం ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఎస్ఆర్ఎస్ 5.1 సరౌండ్ సౌండ్ వ్యవస్థ, అన్ని ఫార్మాట్‌లను సపోర్ట్ చేసే క్వాలిటీ ఆడియో మరియు వీడియో ప్లేయర్, యూజర్ ఈక్వలైజర్, ఎఫ్ఎమ్ రేడియో, వాయిస్ రికార్డింగ్, బ్యాటరీ బ్యాకప్ (మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ 36గంటలు, వీడియో ప్లేబ్యాక్ టైమ్ 8 గంటలు), ఎఫ్ఎమ్ రేడియో, యూఎస్బీ కనెక్టువిటీ, వాయిస్ రికార్డర్, హ్యాండ్ రైటింగ్ ఇన్ పుట్. ధర అంశాలను పరిశీలిస్తే 4జీబి ధర రూ.7,500, 8జీబి ధర రూ.8,400.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot