వింటే పసందే..?

Posted By: Prashanth

వింటే పసందే..?

 

మ్యూజిక్ పరికరాల తయారీలో గుర్తింపు పొందిన బ్రాండ్ ‘బీట్స్’( Beats) అత్యాధునిక మ్యూజిక్ హెడ్‌సెట్‌లను డిజైన్ చేసింది. ‘బీట్స్ వైర్‌లెస్’, ‘బీట్స్ మిక్సర్’ మోడల్స్‌లో ఈ స్పీకర్ సెట్లు విడుదల కానున్నాయి.

ప్రయివేటుగా సంగీతాన్ని ఆస్వాదించాలనుకునే వారికి హెడ్‌సెట్‌ స్పీకర్లు మరింత దోహదపడతాయి. సంగీత ప్రియులు కోరుకునే అన్ని అంశాలను ఈ ఆడియో గ్యాడ్జెట్‌లలో దోహదం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ‘ఆడియో ప్లేయర్లకు ’మరింత డిమాండ్ పెరిగింది. తాజా పరిస్థితులను సమీక్షిస్తే మెబైల్ ఫోన్‌ల నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు ప్రతి డివైజ్‌లో ఆడియో ప్లేయర్‌ను నిక్షిప్తం చేస్తున్నారు.

బ్లూటూత్ వ్యవస్థ ఆధారితంగా బీట్ హెడ్‌సెట్లు పనిచేస్తాయి. ఆడియో నియంత్రణకు సంబంధించిన పలు కంట్రోలింగ్ ఆప్షన్లను ‘ఇయర్ పీస్’లో ఏర్పాటు చేశారు. స్మార్ట్‌ఫోన్ తదితర బ్లూటూత్ ఆధారిత మ్యూజిక్ ప్లేయర్లకు ఈ హెడ్‌సెట్లను జతచేసుకోవచ్చు. ప్రత్యేక సౌండ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ‘బీట్స్ మిక్సర్’ హెడ్‌సెట్ సంగీతాన్ని మిక్స్‌ చేస్తూ ‘డిజే’ అనుభూతిని కలిగిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot