నాణ్యమైన మ్యూజిక్ ‘బీట్స్ హెడ్ సెట్లతో’

Posted By: Staff

నాణ్యమైన మ్యూజిక్ ‘బీట్స్ హెడ్ సెట్లతో’

చిత్రంలోని వాల్ పేపర్ అదరింది కదండి..!! మ్యూజిక్ అంటే మనుషులకే కాదు మూగజీవాలకు ప్రాణమేనన్న సందేశం స్ఫష్టంగా కనబడుతుంది. ఇంతకి మేము చెప్పబోతున్న టాపిక్ ఏంటా అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం...

మ్యూజిక్ పరికరాల తయారీలో గుర్తింపు పొందిన బ్రాండ్ ‘బీట్స్’( Beats) అత్యాధునిక ‘హడ్ సెట్’ స్పీకర్లను రూపొందించింది. ‘బీట్స్ వైర్ లెస్’(Beats Wireless).‘బీట్స్ మిక్సర్’(Beats Mixr) వర్షన్ లలో ఈ స్పీకర్ సెట్లు మార్కెట్లో విడుదల కానున్నాయి.

ప్రయివేటుగా సంగీతాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ‘హెడ్ సెట్’స్పీకర్లు మరింతో దోహదపడతాయి. సంగీత ప్రియులు కోరుకునే అన్ని అంశాలను ఈ ‘బీట్స్ ’ హెడ్ సెట్లలలో పొందుపరిచారు. ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ మరింత వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ‘ఆడియో ప్లేయర్లకు ’మరింత డిమాండ్ పెరిగింది. తాజా పరిస్థితులను సమీక్షిస్తే మెబైళ్ల నుంచి ల్యాప్ టాప్ ల వరకు ప్రతి గ్యాడ్జెట్లో ఆడియో ప్లేయర్ వ్యవస్థ తప్పనిసరైంది.

బ్లూటూత్ వైర్ లెస్ వ్యవస్థ ఆధారితంగా ‘బీట్ హెడ్ సెట్లు’ పనిచేస్తాయి. ఆడియో నియంత్రణకు సంబంధించిన పలు కంట్రోలింగ్ ఆప్షన్లను ‘ఇయర్ పీస్’లో ఏర్పాటు చేశారు. స్మార్ట్ ఫోన్ తదితర మ్యూజిక్ స్టిక్ లకు ఈ హెడ్ సెట్లను జతచేసుకోవచ్చు. ప్రత్యేక సౌండ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ‘బీట్స్ మిక్సర్’ హెడ్ సెట్ సంగీతాన్ని మిక్స్ చేస్తుంది. ‘డిజే’ అనుభూతిని ‘బీట్ మిక్సర్’ హెడ్ సెట్ ద్వారా వినవచ్చు. అత్యాధునిక సౌండ్ వ్యవస్థతో రూపుదిద్దుకున్న ఈ హెడ్ సెట్ పరికరాల ధరకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot