డీవీడీ వీడియోలను సైతం హై డెఫినిషన్ వీడియోలుగా మార్చేస్తుంది!!!

By Prashanth
|
Blu-Ray Player


సమజంసమైన ధరకే మన్నికైన ‘బ్లూరే’ డివైజును సొంతం చేసుకోవాలనుకునే వారికి ‘Vizio’ సంస్థ అత్యాధునిక సాంకేతికతతో VBR122 వర్షన్లో బ్లూరే ప్లేయర్‌ను డిజైన్ చేసింది. వెర్‌లెస్ ఇంటర్నెట్ స్ట్రీమింగ్ వ్యవస్థ ఈ ప్లేయర్లో మరో విశేషం. ఈ సౌలభ్యతతో ఇంటర్నెట్ ద్వారా స్ర్టీమ్ అయ్యే సినిమాలు లేదా వీడియోలను హైక్లారిటీతో తిలకించవచ్చు. స్లాండర్డ్ డెఫినిషన్ డీవీడీ విడియోలను సైతం ఈ ప్లేయర్ హై డెఫినిషన్ వీడియోలకు మలుస్తుంది.

హై - డెఫినిషన్ టీవీలకు మాత్రమే ఈ ప్లేయర్‌ను జత చేసుకునే సౌలభ్యతను కల్పించారు. HDMI కేబుల్ ద్వారా ఈ అనుసంధాన ప్రక్రియ సాధ్యమవుతుంది. డిస్క్ లోడింగ్ సమయం ఒక్క నిమిషం. ఇంటర్నెట్ స్ట్ర్రీమింగ్ వీడియో అప్లికేషన్లను ప్లేయర్లో నిక్షిప్తం చేశారు. స్ట్ర్రీమింగ్ వీడియో సర్వీసులైన నెఫ్లిక్స్, పండోరా, యూ ట్యూబ్ తదితర ఫీచర్లను ముందుగానే చేశారు.

యూఎస్బీ డివైజ్ లను ప్లేయర్ కు జత చేసుకోవచ్చు. Mp3, AAC ఫార్మాట్లలో ఉన్న మ్యూజిక్ ఫైళ్లతో పాటు, JPG, PNG ఫార్మాట్లలో ఉన్న వీడియో ఫైళ్లు డివైజ్‌లో ప్లే అవుతాయి. బహుముఖంగా ఉపయోగపడే విధంగా అత్యాధునిక రిమోట్ కంట్రోల్ వ్యవస్థను ఈ ప్లేయర్ కోసం రూపొందించారు. రిమోట్ కంట్రోల్ ఒక వైపు ప్లేయర్‌ను నియంత్రించే బటన్లను ఏర్పాటు చేయగా, మరో వైపు ఇంటర్నెట్‌ను ఆపరేట్ చేసుకునే విధంగా ఫుల్ సైజు కీబోర్డును ఏర్పాటు చేశారు. భారతీయ మార్కెట్లో ఈ బ్లూరే డిస్క్ ప్లేయర్ ధర రూ.6000 ఉండొచ్చని తెలుస్తోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X