‘బ్లూ యాంట్ స్టీరియో హెడ్ ఫోన్స్’ ఇప్పుడు కొత్త లుక్‌లో!!

Posted By: Super

‘బ్లూ యాంట్ స్టీరియో హెడ్ ఫోన్స్’ ఇప్పుడు కొత్త లుక్‌లో!!

ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీదారు ‘బ్లూ యాంట్’ (BlueAnt) వైర్ల ఆధారిత హెడ్‌ఫోన్ల పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ ‘బ్రాండ్’ విడుదల చేసిన ‘బ్లూయాంట్ ఎంబ్రేస్’ స్టీరియో హెడ్‌ఫోన్‌ను సౌకర్యవంతమైన పోర్టుబల్ రేంజ్‌లో డిజైన్ చేశారు.

ఎటువంటి అరమరికలు లేకుండా సులువుగా ఈ హెడ్‌సెట్లను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. హెడ్‌ఫోన్లలో ఏర్పాటు చేసిన ఇయర్ కప్‌లను కోరుకున్న రీతిలో రొటేట్ చేసుకోవచ్చు. ఈ గ్యాడ్జట్‌ను క్యారీ చేసేందుకు లెదర్ పౌచ్‌ను కోనుగోలుతో పాటు పొందవచ్చు.

రెండు అత్యాధునిక 40mm డ్ర్రైవర్లను గ్యాడ్జెట్లో అమర్చారు. ఈ పరికరంలో నిక్షిప్తం చేసిన అత్యాధునిక సౌండ్ టెక్నాలజీ అవసరంలేని శబ్ధాన్ని నియంత్రించి నాణ్యమైన ఆడియో అవుట్‌ను అందిస్తుంది.

అత్యంత మన్నికైన ‘బ్లూ యాంట్ ట్రూలైఫ్ సౌండ్ టెక్నాలజీ’ని గ్యాడ్జెట్ నిర్మాణంలో ఉపయోగించారు. రియాల్టీ అనుభూతికి లోను చేసే విధంగా క్రిస్టల్ క్లియర్ సౌండ్ అనుభూతిని అంతిమంగా పొందవచ్చు. ఫ్రీక్వెన్సీ రేంజ్ సామర్ధ్యం 20Hz-20KHz.ఐప్యాడ్, ఐఫోన్లతో పాటు ఇతర స్మార్ట్ మొబైల్స్‌కు వైర్య ఆధారితంగా ఈ హెడ్‌సెట్‌ను జతచేసుకోవచ్చు.

సంవత్సరం వారంటీతో రూ.10,000లకు భారతీయ మార్కెట్లో ‘బ్లూయాంట్ ఎంబ్రేస్ స్టీరియో’ హెడ్‌ఫోన్ లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot