అవార్డులు కైవసం చేసుకున్న ‘బ్లూట్రెక్స్’బ్లూటూత్ స్పీకర్లు

Posted By: Staff

అవార్డులు కైవసం చేసుకున్న ‘బ్లూట్రెక్స్’బ్లూటూత్ స్పీకర్లు

 

బ్లూటూత్  టెక్నాలజీ  ఆధారిత పరికరాలను తయారు చేయటంలో అగ్రగామిగా నిలిచిన  ‘బ్లూట్రెక్స్ ’(Bluetrek) సంస్థ అంతర్జాతీయ అవార్డులకు ఎంపికైంది. ఈ సంస్ధ డిజైన్ చేసిన ‘కార్బన్ ఫైబర్ బ్లూ టూత్ హెడ్‌సెట్’, ‘స్పీకీ బ్లూటూత్ కార్ స్పీకర్ ఫోన్’కు  ప్రతిష్టాత్మక ‘సీఈఎస్’ ఇన్నోవేషన్స్ సంస్థ 2012కుగాను డిజైన్, ఇంజనీరింగ్ అవార్డులను అందించనుంది.

కేవలం 5.9 గ్రాముల బరువుతో డిజైన్ కాబడిన ‘కార్బన్ బ్లూటూత్ హెడ్‌సెట్’ పటిష్ట కార్బన్ ఫైబర్ పదార్ధంతో తయారు కాబడింది. ఈ హెడ్‌సెట్లో పొందుపరిచిన బ్లూటూత్ 3.0 కనెక్టువిటీ  వ్యవస్థ  నిరంతరం అంతరాయం లేని అనుభూతిని వినియోగదారుడికి  కలిగిస్తుంది. అదే విధంగా ఈ గ్యాడ్జెట్లో అమర్చని మైక్రోఫోన్ ‘క్రిస్టల్ క్లియర్ సౌండ్’ను అందిస్తుంది.

అత్యాధునిక సాంకేతిక ఫీచర్లతో ‘బ్లూట్రెక్స్ ’ రూపొందించిన  మరో గ్యాడ్జెట్ ‘స్పీకీ మొబైల్ బ్లూటూత్ స్పీకర్ ఫోన్’ డ్రైవింగ్ చేసే సందర్భంలో  ‘హ్యాండ్ ఫ్రీ’ కాలింగ్ కు ఈ స్పీకర్ ఫోన్ ఉపకరిస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్లో పొందుపరిచిన యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.  ఈ గ్యాడ్జెట్లో ఏర్పాటు చేసిన ‘స్పీకీ’ వ్యవస్థ ఆటోమెటిక్ ఆన్,ఆఫ్ సౌలభ్యతను కలిగి ఉంటుంది. భారతీయ మార్కెట్లో  త్వరలో విడుదల కాబోతున్న ‘బ్లూట్రెక్స్ ’ బ్లూటూత్ గ్యాడ్జెట్లు రూ.3,500కు లభ్యంకానున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot