‘బోస్’ సిరీస్ -2 హెడ్ సెట్ల విశేషాలు...!!

By Super
|
Bose Bluetooth Series 2

‘బోస్ సిరీస్ -2’ మ్యూజిక్ గ్యాడ్జెట్లు మార్కెట్లో విడుదలయ్యాయి. అత్యాధునిక సౌండ్ ఫీచర్లలో విడుదలైన ‘హెడ్ సెట్ల’ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. బోస్ సిరీస్ -2లో విడుదలైన ‘బ్లూటూత్ ఆధారిత హెడ్ సెట్లు’ కేవలం 48 ఔన్సుల బరువుతో డిజైన్ కాబడ్డాయి.

క్లుప్తంగా ఫీచర్లు:

- బ్లూటూత్ సాంధ్రత మరియు బ్యాటరీ సామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు సూచించే విధంగా ‘ఎల్ ఈడీ’ లైట్లను హెడ్ సెట్లలో అమర్చారు. ఏర్పాటు చేసిన గ్రీన్, ఎల్లో, రెడ్ ఫ్లాష్ ఇండికేటర్లు ఎప్పటికప్పుడు స్టేటస్ ను తెలియజేస్తుంటాయి.

- మల్టీ ఫంక్షన్ కాల్ వ్యవస్థతో పాటు వాల్యుమ్ కంట్రోల్ బటన్లను గ్యాడ్జెట్లో పొందుపరిచారు.

- నాణ్యమైన బ్లూటూత్ పెయిరింగ్ వ్యవస్థను గ్యాడ్జెట్లో లోడ్ చేశారు.

- ఏర్పాటు చేసిన బ్యాటరీ వ్యవస్థ 5 గంటల 42 నిమిషాల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

- హడ్ సెట్లో ఏర్పాటు చేసిన నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ అంతరాయంలేని ఆడియోను శ్రోతకు అందిస్తుంది.

- హెడ్ ఫోన్ ఎడ్జస్టుమెంట్లు చెవులకు సౌకర్యవంతంగా ఉంటాయి.

- పటిష్ట A2DP సౌండ్ వ్యవస్థను గ్యాడ్జెట్లో పొందుపరిచారు.

-ఇండియన్ మార్కెట్లో త్వరలో విడుదల కాబోతున్న అత్యాధునిక బ్లూటూత్ హెన్ ఫోన్ల ధరలు రూ.6750 నుంచి ప్రారంభం కానున్నాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X