Home
Music

బోస్ తొలిపరిచయం ‘సౌండ్ బార్ సిస్టమ్’.. త్వరలో!!

By Super
Bose launches Soundbar Systems!!!!!!
‘సౌండ్ బార్ సిస్టమ్’లకు నామ మాత్రం ఆదరణ ఉన్న భారతీయ మార్కెట్లో దిగ్గజ మ్యూజిక్ పరికరాల తయారీదారు ‘బోస్’ రెండు సౌండ్ బార్ సిస్టమ్‌లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. బోస్ లైఫ్ స్టైల్ 135, బోస్ సినీమేట్ 1 SR క్యాటగిరీలో విడుదల కాబోతున్న ఈ పరికరాలు సుప్రిమ్ ఆడియో నాణ్యతను శ్రోతకు అందిస్తాయి.

‘లైఫ్ స్టైల్ 135’లో నాలుగు హెచ్‌డీ‌ఎమ్‌ఐ ఇన్‌పుట్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. డ్యూయల్ ఎఫ్ఎమ్, ఏఎమ్ రేడియో ట్యూనింగ్ వ్యవస్థలు సిస్టమ్‌కు ప్రత్యేకం. ఐపాడ్‌కు అనుసంధానం చేసుకునే విధంగా డాకింగ్ వ్యవస్థను ‘135’లో ఏర్పాటు చేశారు.

‘బోస్ సినీమేట్ 1 SR’ సౌండ్ బార్ సిస్టమ్‌ను కేబుల్ ఆధారితంగా టీవీకి అనుసంధానం చేసుకోవచ్చు. బార్ సిస్టమ్‌లో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ ప్లేస్‌మెంట్ టెక్నాలజీ, బార్ సిస్టమ్‌ను రూమ్‌లో ఎక్కడైనా అమర్చుకునేందుకు సహకరిస్తుంది.

రిమోట్ ఆధారితంగా ఈ గ్యాడ్జెట్లను నియంత్రించుకోవచ్చు. ఈ సౌండ్ పరికరాల్లో అమర్చిన సౌండ్ రేడియేటర్ టెక్నాలజి (ఫేష్ గైడ్), ట్రూ స్పేస్ సిగ్నల్ ప్రొసెసింగ్ వ్వవస్థలు నాణ్యమైన సౌండ్ అనుభూతికి లోను చేస్తాయి.

సినిమాలు చూసే సందర్భంలో, మ్యూజిక్ ను వినే సందర్భంలో థియోటర్ సౌండ్ అనుభూతిని మీరు పొందవచ్చు. ఇండియన్ మార్కెట్లో వీటి ధరలను పరిశీలిస్తే ‘లైఫ్ స్టైల్ 135’ రూ.1,20,000, ‘బోస్ సినీమేట్ 1 SR’ ధర రూ.75,000కు లభ్యమవునున్నట్లు తెలుస్తుంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X