ఇండియాలో ‘బోస్’ కొత్త స్పీకర్లు!!

Posted By: Super

ఇండియాలో ‘బోస్’ కొత్త స్పీకర్లు!!

 

న్యూఢిల్లీ: రెండు కొత్త స్పీకర్ సిస్టమ్స్‌ను బోస్ కంపెనీ బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెండు స్పీకర్ సిస్టమ్స్ - సినిమేట్ 1 ఎస్‌ఆర్(ధర రూ.1,12,388), లైఫ్ స్టైల్ 135(రూ.1,79,882) వారం రోజుల్లో బోస్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ తెలిపింది. ఏఎం/ఎఫ్‌ఎం ట్యూనర్, ఐపాడ్/ఐఫోన్‌ల కోసం డాక్, 6 హెచ్‌డీ సోర్సెస్ వరకూ మీడియా కన్సోల్ వంటి ఫీచర్లున్నాయని పేర్కొంది. ఈ స్పీకర్లు 6సెం.మీ. ఎత్తు, 93.4 సెం.మీ. వెడల్పు ఉంటాయని తెలిపింది. కంపెనీకి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చంఢీఘర్, జైపూర్, తదితర నగరాల్లో 31 స్టోర్లు ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot