కోరికుంటే సరిపోదు.. దూసుకుపోవాలంతే..!!

Posted By: Staff

కోరికుంటే సరిపోదు.. దూసుకుపోవాలంతే..!!

‘‘ప్రస్తుత రంగుల ప్రపంచంలో సంగీత మధురిమలను ఆస్వాదించని కుర్రకారు ఎవరైనా ఉన్నారంటే వేళ్లలో లెక్కపెట్టి చెప్పొచ్చు. జోష్‌ను రెట్టింపు చేసే మ్యూజిక్ యువత నిత్యావసరాల్లో ఒక భాగమైపోయింది. వినేందుకు అన్ని వయసుల వారు ఆసక్తిని కనబర్చే సంగీతాన్ని నాణ్యమైన పాళ్లలో శ్రోతలకు అందించేందుకు సౌండ్ స్పీకర్లు, హోమ్ థియోటర్లు ఇలా రకరకాల సాంకేతిక మ్యూజిక్ పరికరాలు అందుబాటులో ఉంటున్నప్పటికి, ధరల విషయంలో అందని ద్రాక్షలానే ఉన్నాయి. గ్యాడ్జెట్ల ప్రపంచంలో నానాటికి చోటుచేసుకుంటున్న మార్పులు ‘సాంకేతిక వస్తు రంగంలో’ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయి. వైర్లు ఆధారితంగా పనిచేసే సౌండ్ స్పీకర్లకు కాలం చెల్లింది. బ్లూటూత్ వ్యవస్ధ ఆధారితంగా వైర్ కనెక్షన్ సాయం లేకుండా పనిచేసే సరికొత్త మొబైల్ స్పీకర్లు అందుబాటులోకి వచ్చాయి. సంగీత ప్రేమికులచే విశ్వసనీయ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘బోస్’ (Bose) సరసమైన ధరల్లో సౌండ్ లింక్ వైర్‌లైస్ మొబైల్ స్పీకర్లను మార్కెట్లో ప్రవేశపెట్టి కొత్త సంచలనానికి తెరలేపింది.’’

బోస్ మొబైల్ స్పీకర్ ఫీచర్లు క్లుప్తంగా :

- బ్లూటూత్ వ్యవస్థ ఆధారితంగా ఈ స్పీకర్లు పనిచేస్తాయి. బ్లూటూత్ వ్యవస్థ అనుసంధానించబడి ఉన్న మొబైల్, కంప్యూటర్, ల్యాపీ, టాబ్లెట్ పీసీ, ఐపాడ్, వాక్‌మెన్ తదితర పరికరాలను బ్లూటూత్ వ్యవస్థ సాయంతో స్పీకర్లకు కనెక్టు చేసుకోవచ్చు.

- అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన స్పీకర్లు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన వినసొంపైన సంగీతాన్ని శ్రోతకు అందిస్తాయి. రిమోట్ ఆధారితంగా స్పీకర్ల సౌండ్ ఆప్షన్లను మార్చుకోవచ్చు.

- స్పీకర్ బాక్సుల్లోకి దుమ్ము, ధూళి వంటి మలినాలు చేరకుండా ఉండేందుకు లిడ్ (lid) ఇతర ధ్రవ్య పదార్థాలతో తయారుచేసిన షీల్డ్‌లను స్పీకర్ బాక్సులకు రక్షణ వలయంలా ఏర్పాటు చేశారు.

- సంగీత ప్రేమికులకు మరో చక్కటి అవకాశం ఈ బ్రాండ్ కల్పిస్తోంది. బోస్ స్పీకర్లను కోనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడికి స్పీకర్లను అందంగా డెకరేట్ చేసుకునేందుకుగాను ఆకర్షణీయమైన రంగుల్లో తీర్చిదిద్దబడిన లెదర్ కవర్లను సంస్థ పంపిణి చేస్తోంది.

- మీరు ఎంచుకున్న మ్యూజిక్ ప్లేయర్లకు ధీటుగా ఈ స్పీకర్లు సంగీత అనుభూతిని కలిగిస్తాయి.

- ఇప్పటికే మార్కెట్లో విడుదలై వినియోగదారులు మెప్పు పొందిన ఈ మొబైల్ స్పీకర్ల ధరలు రూ. 14,349 నుంచి ప్రారంభమవుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot