మీరు ‘ఆపిల్ ఐఫోన్ 4s’యజమానా..?

Posted By: Staff

మీరు ‘ఆపిల్ ఐఫోన్ 4s’యజమానా..?


"తాజాగా ఆపిల్ విడుదల చేసిన ‘ఐఫోన్ 4s’కు మీరు యజమానా..? అయితే మీకో మన్నికైన వార్త..!!, మీ అత్యుత్తమ ‘ఆపిల్ ఫోన్’కు అదిరిపోయే ‘హెడ్ ఫోన్’ను జత చేస్తే ఏలా ఉంటుంతో ఓ సారి ఊహించుకున్నారా..?"

ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీదారు ‘బోస్’, దిగ్గజ ‘ఆపిల్’తో జత కట్టిన విషయం తెలిసిందే. అయితే బోస్ తాజాగా ఐఫోన్ 4sకు సహకరించే విధంగా ‘OE2i’ ఆడియో హెడ్ ఫోన్లను రూపొందించింది. ప్రస్తుత మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న బోస్ కొత్త తరం హెడ్ ఫోన్లు నాణ్యమైన సౌండ్ పరిజ్ఞానంతో డిజైన్ కాబడ్డాయి.

‘OE2i’ హెడ్ ఫోన్ల ఫీచర్లను పరిశీలిస్తే అత్యాధునిక ‘ట్రై పోర్టు’ టెక్నాలజీని బోస్ ప్రవేశపెట్టింది. తక్కువ బరువుతో రూపొందించబడిన ఈ హెడ్ ఫోన్లు అత్యుత్తమ ఆడియో అనుభూతిని శ్రోతకు అందిస్తాయి. ‘బోస్ ఆక్వొస్టిక్ ఈక్వలైజేషన్’ విధానాన్ని గ్యాడ్జెట్లో పొందుపరిచారు. హెడ్ ఫోన్లకు సంబంధించి బోస్ ‘ఇన్ లైన్ 3 బటన్’ను రూపొందించింది. ఈ రిమోట్ ఆధారితంగా వాల్యూమ్, ట్రాక్ సెలక్షన్ తదితర అప్లికేషన్లను ఆపరేట్ చేయ్యవచ్చు.

‘హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ అప్లికేషన్’తో పాటు వివిధ వాయిస్ అప్లికేషన్లను హెడ్ సెట్లో ఏర్పాటు చేశారు. అంతరాయంలేని ఆడియోను వినటంతో పాటు కాల్స్ ను రిసీవ్ చేసుకోవచ్చు. చెవులకు సౌకర్యవంతంగా ఉండేవిధంగా ‘OE2i’ ఇయర్ బడ్ లను డిజైన్ చేశారు. తెలుపు రంగులో లభ్యమవుతున్న బోస్ OE2i‘ఐఫోన్ 4S’
హెడ్ ఫోన్ల మార్కెట్ ధర రూ. 6, 500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot