బోస్ వైర్ లెస్ ఆడియో సిస్టమ్ అదిరింది..

Posted By: Super

బోస్ వైర్ లెస్ ఆడియో సిస్టమ్ అదిరింది..

బాస్ మ్యూజిక్ సిస్టమ్స్ ఉత్పత్తులను మార్కెట్లోకి యాపిల్ కంపెనీ ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రస్తావించడానికి కారణం యాపిల్ స్టోర్స్‌లలో బాస్ ఆడియో ప్రోడక్ట్స్ అందుబాటులో ఉండడమే. బాస్ రూపోందించిన ఉత్పత్తులు హెడ్ ఫోన్స్, కంప్యూటర్ స్పీకర్స్, ఇయర్ ఫోన్స్ లాంటివి అన్ని కూడా యాపిల్ రిటైల్ స్టోర్స్, యాపిల్ ఆన్ లైన్ స్టోర్స్‌లలో దర్శనమిస్తున్నాయి. బాస్ కంపెనీ రూపోందించేటటువంటి ఉత్పత్తులు అచ్చం యాపిల్ మాదిరే ఉండడమే కాకుండా మార్కెట్లో లీడింగ్ మ్యూజిక్ సిస్టమ్స్ అయిన ఎయిర్ ప్లే, సోనోస్‌కి గట్టి పోటిని కూడా ఇస్తున్నాయి.

మార్కెట్లోకి కొత్తగా బాస్ కంపనీ వైర్ లెస్ ఆడియో సిస్టమ్స్‌ని ప్రవేశపెట్టనుంది. కొన్ని వెబ్ సైట్స్‌లలో వచ్చిన వార్తలను బట్టి చూస్తే బాస్ విడుదల చేయనున్న వైర్ లెస్ ఆడియో సిస్టమ్స్ చాలా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. బాస్ త్వరలో విడుదల చేయనున్న ఆడియో సిస్టమ్ పేరు చిహువాహువా. మార్కెట్లో పాపులర్ గాడ్జెట్స్‌కి సంబందించిన వెబ్ సైట్ బెస్ట్ బై ప్రకారం బాస్ చిహువాహువాలో కొత్త పాపులర్ టెక్నాలజీ అయిన వైర్ లెస్ ఎమ్‌పి3 స్పీకర్ డాకింగ్ స్టేషన్‌ని వాడినట్లు సమాచారం.

దీనితో పాటు ఇందులో ఉపయోగించిన మరో అత్యాధునికమైన టెక్నాలజీ ఏంటంటే ఆడియో స్పష్టంగా వివిపించేందుకు గాను డీపర్ బాస్‌ని వాడినట్లు సమాచారం. దీని వాడడం వల్ల స్పీకర్స్ నుండి బయటకు వచ్చే ఆడియో రూమ్‌లో ఉన్న గోడలు, ఛైర్స్ నుండి కూడా తిరిగి మరలా పరివర్తనం చెందే ఫీచర్‌ని కలిగి ఉంటాయంట. ఇంకోక రూమర్ టెక్నాలజీ ఏమిటంటే ఇందులో సౌండ్ లింక్ టెక్నాలజీని కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ టెక్నాలజీ వల్ల యుఎసి‌బి మ్యూజిక్ స్ట్రీమ్ ఎటువంటి వైర్స్ లేకుండా అందిస్తుంది. ఈ ఫీచర్ ఇటీవల విడుదలైన పాపులర్ ప్రోడక్ట్స్‌లో మాత్రమే ఇమడింపజేయడం జరిగిందన్నారు.


బాస్ చిహువాహువా వైర్ లెస్ మ్యూజిక్ సిస్టమ్‌కి ఎటువంటి ఎడాప్టర్స్ అవసరం లేదంటున్నారు నిపుణులు. సాధారణ ఆడియో సిస్టమ్‌తో పొల్చితే గనుక ఈ ఆడియో సిస్టమ్ అదిరిపోయేటటువంటి మ్యూజిక్‌ని అందిస్తుందని అంటున్నారు. బాస్ చిహువాహువా చూడడానికి చాలా అందంగా స్లీక్ ఉంటుంది. ఇక బాస్ ఆడియోస్ కొత్తతనానికి నాంది అన్న విషయం అందరికి తెలిసిందే. బాస్ ప్రోడక్ట్స్‌లో ఉన్న సౌండ్ ఇంజన్స్ subwoofer level control, parametric equalizationకి లాంటి ప్రత్యేకతలను ఎన్నింటినో కలిగి ఉంది. మార్కెట్లో బాస్ చిహువాహువాకి సంబంధించిన ధరను ఇంకా వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot