‘బోస్’ను సపోర్టు చేస్తున్న ‘ఆపిల్’..!!

‘ఆపిల్ ఎయిర్ ప్లే’ మరియు ‘సోనాస్’లు రూపొందించే మ్యూజిక్ పరికరాలకు దగ్గర పోలిక కలిగి ఉండే ‘బోస్’ గ్యాడ్జెట్లకు మార్కెట్లో డిమాండ్ అధికంగానే ఉంది. అయితే సరికొత్త కూల్ టెక్నాలజీ వ్యవ్థస్థను ‘బోస్ చిహుహా’లో పొందుపరిచినట్లు సమాచార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వైర్‌లెస్ స్పీకర్ వ్యవస్థలో భాగమైన ఎంపీత్రీ డాకింగ్ స్టేషన్ ను అల్ట్రా స్మాల్ పరిమాణంలో వినూత్నంగా తీర్చిదిద్దినట్లు వినికిడి.
స్పీకర్ వ్యవస్థలో పొందుపరిచిన ప్రత్యేక ‘సౌండ్ లింక్ టెక్నాలజి’ వైర్ల సాయం లేకుండా యూఎస్బీ డాంగిల్స్‌కు అంతరాయంలేని సంగీతాన్ని ట్రాన్సిమిట్ చేస్తుందట. 'లో పాస్' ఫిల్టర్స్, పారామెట్రిక్ ఈక్వలైజేషన్, శక్తివంతమైన సబ్ ఊఫర్ వ్యవస్థలు నాణ్యమైన వీడియో వ్యవస్థను వినియోగదారుడికి అందిస్తాయి. సాధారణ ఆడియో వ్యవస్థలతో పోలిస్తే 100 రెట్లు మెరుగైన పనితీరు బోస్ వైర్‌లెస్ ఆడియో వ్యవస్థ కలిగి ఉంటుందని విశ్లేషక వర్గాలు సూచిస్తున్నాయి.


Click it and Unblock the Notifications