బోస్టన్ స్పీకర్ సిస్టంతో మోత మోగించండి!!

Posted By: Prashanth

బోస్టన్ స్పీకర్ సిస్టంతో మోత మోగించండి!!

 

హై క్వాలటీ ఆడియో ఉత్పత్తులను తయారు చేయటంలో ప్రసిద్ధికెక్కిన ‘బోస్టన్ ఆకౌస్టక్స్’ (Boston Acoustics) ఆడ్వాన్సడ్ స్పెసిఫికేషన్లతో విర్ట్యుల్ సరౌండ్ సౌండ్ టెక్నాలజితో కూడిన ‘Tvee model 25’ స్పీకర్ సిస్టంను మార్కెట్లో విడుదల చేసింది.

నాణ్యమైన క్లారిటీతో కూడిన హై ఆడియోను విడుదల చేయటమే ఈ స్పీకర్ సిస్టం ప్రధాన లక్యం. టీవికి జత చేసుకునే విధంగా ఈ సౌండ్ బార్ సిస్టంను డిజైన్ చేశారు. శక్తివంతమైన వైర్‌లెస్ సబ్‌ఊఫర్‌ను ఈ స్పీకర్ ద్వారా పొందవచ్చు. అంతిమంగా ఈ స్పీకర్ సిస్టం ద్వారా ఇంట్లోనే ఖచ్చితమైన ధియోటర్ అనుభూతిని కుటుంబ సమేతంగా ఆస్వాదించవచ్చు.

క్లుప్తంగా ఫీచర్లు:

- సౌండ్ బార్ చుట్టుకొలతలు 112 x 800 x 112 mm,

- సబ్ ఊఫర్ చుట్టు కొలతలు 241 x 266 x 280 mm.

-150 Watts పవర్ సామర్ధ్యం,

- 6 అంగుళాల సబ్ ఊఫర్స్,

- డ్యూయల్ 1-1/2 x 6 inch డ్రైవర్స్,

- అత్యాధునిక సౌండ్ టెక్నాలజి,

- ట్రబుల్ ఫ్రీ ఇన్సటాలేషన్,

- వైర్ లెస్ సబ్ ఊఫర్ వ్యవస్థ,

- స్పీకర్ సిస్టంను సులభంగా ఆపరేట్ చేసుకునే విధంగా రిమోట్ కంట్రోల్ వ్యవస్థ,

- ప్లగ్ అండ్ ప్లే టెక్నాలజీ,

- 3.5 మిల్లి మీటర్ ఆక్సిలరీ ఇన్ పుట్,

- ధర రూ.20,000

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot