ఖచ్చితమైన అనుభూతి కోసం ‘c5’ ఇయర్ ఫోన్!!

Posted By: Super

ఖచ్చితమైన అనుభూతి కోసం ‘c5’ ఇయర్ ఫోన్!!

 

హై క్వాలిటీ ఆడియో పరికరాలను రూపొందించటంలో ఉత్తమ బ్రాండ్ గా గుర్తింపుతెచ్చుకున్న ‘బోవర్స్ అండ్ విల్కన్స్’ (Bowers and Wilkins)యూజర్ ఫ్రెండ్లీ నేపధ్యంతో ‘సీ5’ మోడల్ ఇయర్ ఫోన్లను డిజైన్ చేసింది.

ఇయర్ ఫోన్ లో ఏర్పాటు చేసిన ‘నాయిస్ ఐసోలేషన్ టెక్నాలజీ’ అనవసర నాయిస్ మీ చెవులను తాకకుండా చేస్తుంది. తద్వారా సహజసిద్ధమైన అనుభూతిని మీరు పొందగలుగుతారు. మరో వ్యవస్థ ‘మైక్రో పోరస్ ఫిల్టర్’ (micro porous filter) మన్నికైన సౌండ్ అనుభూతిని శ్రోతకు పంచుతుంది. ఆపిల్ డివైజులకు సీ5 ఇయర్ ఫోన్లను సమర్ధవంతంగా జత చేసుకోవచ్చు.

ఇయర్ ఫోన్ల బరువు కేవలం 0.7 ounces, ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం 10Hz నుంచి 20 kHzవరకు. 3.5 mm కనెక్టర్ వ్యవస్థ వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తుంది. అత్యాధునిక హంగులతో అతి త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల కాబోతున్న ‘సీ5’ ఇన్ -ఇయర్ హెడ్ ఫోన్ల ధర తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot