త్వరలో 'పయనీర్ మిక్స్‌ట్రాక్స్ టెక్నాలజీ'

Posted By: Super

త్వరలో 'పయనీర్ మిక్స్‌ట్రాక్స్ టెక్నాలజీ'

 

కారులో ఎక్కువ దూరం వెళుతున్నప్పడు లేదా సిటిలలో ట్రాఫిక్ మద్యలో చిక్కుకున్నప్పడు ఎంటర్టెన్మెంట్ కోసం  కారులో ఆడియో ఉంటే ఆ ఆనందమే వేరు కదా.. అందుకే  కారు ఆడియో సిస్టమ్స్ బాగా పాపులారిటీని సంపాదించిన విషయం తెలిసిందే. దీనిని మార్కెట్లో క్యాష్ చేసుకునేందుకు గాను 'పయనీర్ ఆడియో సిస్టమ్' మార్కెట్లోకి కొత్త కారు ఆడియో సిస్టమ్‌ని విడుదల చేసింది.

పయనీర్ విడుదల చేయనున్న ఈ కొత్త ఆడియో సిస్టమ్‌లో 'మిక్స్ ట్రాక్స్ టెక్నాలజీ'ని వాడారని సమాచారం. ఈ టెక్నాలజీతో కారులో పాటలు వింటుంటే అచ్చం క్లబ్ మాదిరే ఉంటుందని వినికిడి. ఈ ఆడియో సిస్టమ్‌ని కేవలం చక్కని ఆడియో కారులో వెళుతున్నప్పడు వచ్చే విధంగా రూపొందించడం జరిగింది.  ఈ మిక్స్ ట్రాక్స్ టెక్నాలజీ సిస్టమ్ రెండు మ్యూజిక్ ట్రాక్స్‌ని కలుపుకోని అందమైన సంగీతాన్ని యూజర్స్‌కు అందించనుంది. దీని సహాయంతో మీ ప్లే లిస్ట్‌లో ఉన్న మొత్తం ప్లే లిస్ట్‌లను సింగిల్ ఆడియో ట్రాక్‌లో ప్లే చేయవచ్చు.

ఈ మిక్స్ ట్రాక్స్ టెక్నాలజీని పయనీర్ ఆడియో సిస్టమ్ '2012 ఆటో ఎక్పో'లో ప్రదర్శించనున్నారు. త్వరలోనే పాఠకులకు పయనీర్ ఆడియో సిస్టమ్ విడుదల చేయనున్న మిక్స్ ట్రాక్స్ టెక్నాలజీ గురించిన మరింత సమాచారం అందజేయడం జరుగుతుంది.

ప్రత్యేకతలు:

* iPod / iPhone connectivity

* USB support

* Virtual DJ effect

* Superb sound quality

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot