క్లారిటీ మిస్ కాదు..!!

Posted By: Prashanth

క్లారిటీ మిస్ కాదు..!!

 

మ్యూజిక్ గ్యాడ్జెట్స్ రంగంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ‘ఏబుల్ ప్లానెట్’ (AblePlanet) క్లియర్ హార్మోని పేరుతో అత్యాధునిక హెడ్ ఫోన్లను డిజైన్ చేసేంది. ప్రైవైసీ కోరుకునే వారు హెడ్‌ఫోన్స్ ద్వారా సంగీతాన్ని ఆస్వాదిస్తుంటారు. మ్యూజిక్ ఆస్వాదిస్తున్న సందర్భంలో బాహ్య వాతావరణం నుంచి అనేక ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఏబుల్ ప్లానెట్ ప్రవేశపెట్టిన క్లియర్ హార్మోని హెడ్‌ఫోన్స్ ఈ విధమైన సమస్యలకు పూర్తి స్ధాయిలో చెక్ పెడతాయి.

ఈ హెడ్‌ఫోన్స్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ అంతరాయంలేని క్లారిటీ ఆడియోను శ్రోతకు అందిస్తుంది. ఇన్‌లైన్ వాల్యూమ్ కంట్రోల్, 5 అడుగల హెడ్‌ఫోన్ కార్డ్, ఎయిర్ ప్లేన్ ఆడాప్టర్ వంటి మన్నికైన ఫీచర్లను ఈ స్పీకర్ సిస్టంలో పొందుపరిచారు.

ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం 20 నుంచి 20,000 Hzవరకు. అవుట్ పుట్ పవర్ 30m W. సెట్‌లో ఏర్పాటు చేసిన AAA బ్యాటరీ దీర్ఘాకాలిక బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ధర రూ.10,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot